టీ.దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ప్రస్తుత ఈ చలి కాలంలో ఉదయం లేవగానే ఒక కప్పు వేడి వేడి టీని తాగుతుంటే ఉంటుందీ.అబ్బబ్బబ్బా అదిరిపోతుంది.
అలాగే టీలో లెమన్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, వైట్ టీ, మిల్క్ టీ ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి.అందులో ఉప్పు టీ కూడా ఒకటి.
అవును, మీరు విన్నది నిజమే.ఉప్పుతో టీ తయారు చేస్తారు.
ఈ టీ అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాదు.వింటర్ సీజన్లో దీన్ని తాగితే మస్తు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఉప్పుతో టీని ఎలా తయారు చేసుకోవాలి.? అసలు చలికాలంలో ఈ టీని తీసుకోవడం వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ.? వంటి విషయాలను చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో కప్పు వాటర్, ఒక స్పూన్ టీ పౌడర్ వేసి మరిగించాలి.
ఆ తర్వాత అందులో ఒక కప్పు పాలు, చక్కెరకు బదులుగా పావు స్పూన్ పింక్ సాల్ట్ వేసి మళ్లీ మరిగిస్తే టీ సిద్ధమైనట్టే.ఈ టీని ఫిల్టర్ చేసుకుని వేడి వేడిగా తాగితే సూపర్ టేస్ట్ ఉంటుంది.
అలాగే చలికాలంలో ఉప్పు టీని తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకు పోయిన కఫం కరిగిపోతుంది. గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, గొంతు గరగర, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ ఉప్పు టీ గ్రేట్‌గా సహాయపడుతుంది.
ఇక తీవ్రమైన తల నొప్పి వేధిస్తున్నప్పుడు పెయిన్ కిల్లర్స్‌ను వేసుకునే బదులు ఒక కప్పు ఉప్పు టీని తాగాలి.ఇలా చేస్తే తలనొప్పి నుంచి క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది.ఉప్పు టీని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు సైతం తగ్గుతాయి.
అయితే గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే.అధిక రక్త పోటు ఉన్న వారు ఉప్పు టీ తాగరాదు.
అలాగే ఏ ఉప్పు పడితే ఆ ఉప్పు కాకుండా.టీ తయారు చేసుకోవడానికి పింక్ సాల్ట్‌ను మాత్రమే వాడాలి.
టేస్ట్‌గా ఉందనో, ఆరోగ్యానికి మంచిదని చెప్పామనో ఉప్పు టీని అధికంగా కూడా తీసుకోరాదు.