స్మార్ట్ ఫోన్‌లు వచ్చిన తర్వాత పక్కన వారితో పని లేకుండా పోయింది.ఒకప్పుడు రైలు జర్నీ అంటే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు పరిచయం అయ్యే వారు.
వారితో స్నేహం ఏర్పడేది.కాని ఇప్పుడు పక్క సీటు వారితో కూడా మాట్లాడే పరిస్థితి లేదు.
ఎందుకంటే చేతిలో ఫోన్ పట్టుకుని ఇక లోకాన్నే మర్చి పోయినట్లుగా చూస్తున్నారు.చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుంటే పక్కన బాంబు పేలినా కూడా పట్టించుకోనంతగా దీర్ఘ ఆలోచనలో పడి పోతున్నారు.
ఎంతో మంది స్మార్ట్ ఫోన్ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకోవడం వల్ల కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆ ఇబ్బందులు ఏంటీ, వాటితో ఎలా జాగ్రత్తగా ఉండాలో చూద్దాం.
ఇయర్ ఫోన్స్ బయట ఉన్నప్పుడు పెట్టుకోవడం మంచిది కాదు.తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుకోవాలి అంటే కాస్త తక్కువ సౌండ్ పెట్టుకుని, బయట సౌండ్స్ వినిపించేలా ఉండాలి.రోడ్డు మీద నడుస్తున్న సమయంలో వెనుక వచ్చే వాహనాల శబ్దాలు వినిపించేలా సౌండ్ పెట్టుకోవాలి.రెండు చెవుల్లో కాకుండా ఒక్క చెవిలోనే ఇయర్ ఫోన్ పెట్టుకుంటే మరీ మంచిది.
వాహనాల మీద వెళ్లే సమయంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుంటే చాలా మంచిది.
చెవి ఒక స్థాయి శబ్దం వరకు మాత్రమే వినగలదు అనే విషయం తెల్సిందే.అయితే ఆ స్థాయి శబ్దంను ఎక్కువ సమయం విన్నా కూడా చెవి నరాలు ఇబ్బందికి గురవుతాయి.చెవిలో అత్యధిక శబ్దం కావడం వల్ల చెవి నరాలు వైబ్రేట్ అయ్యి అవి వాటి పనిని సక్రమంగా నిర్వర్తించలేవు.
ఒకరి ఇయర్ ఫోన్స్‌ను మరొకరు వాడటం ఏమాత్రం కరెక్ట్ కాదు.అలా వాడటం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయి.ఎందుకంటే ఒకరి చెవిలోని ఇన్ఫెక్షన్ మరొకరి చెవిలోకి వస్తుంది.అలా రావడం వల్ల లేనిపోని జబ్బులు వస్తాయి.
ఇయర్ ఫోన్స్‌కు బడ్స్ ఉండాలి.వాటిని వారంలో ఒకశారి అయినా శానిటైజ్ చేయాలి.దాని వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.పదే పదే వాడటం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది.
సరదాగా వాడే ఇయర్ ఫోన్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా లేకుంటే ప్రాణాలకే ప్రమాదం.అందుకే ఈ జాగ్రత్తలు పాటించండి.