బాడీని క్లీన్ చేసే కరివేపాకు.. రోజు ఉదయం ఇలా తీసుకుంటే మస్తు లాభాలు!

కరివేపాకు.( Curry leaves ) దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.నిత్యం వంటల్లో కరివేపాకును వాడుతుంటారు.కూర అయినా, రైస్ ఐటమ్ అయినా కరివేపాకు పడిందంటే ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ వచ్చేస్తుంది.అయితే చాలా మంది భోజనం చేసే సమయంలో కరివేపాకు కనిపించింది అంటే తీసి పక్కన పెట్టేస్తుంటారు.కానీ కరివేపాకు ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

 How To Detox Our Body With Curry Leaves , Curry Leaves, Curry Leaves Health-TeluguStop.com

కరివేపాకులో .( Curry leaves )ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఎ.ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

Telugu Curry, Curry Benefits, Detox, Tips, Latest-Telugu Health

కరివేపాకును నిత్యం తీసుకోవడం వల్ల అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చు.ముఖ్యంగా బాడీని క్లీన్ చేసే సామర్థ్యం కరివేపాకుకు ఉంది.రోజు ఉదయం ఇప్పుడు చెప్పబోయే విధంగా కరివేపాకుని తీసుకుంటే మస్తు ఆరోగ్య లాభాలు పొందుతారు.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో మూడు రెబ్బలు కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ( Cumin )వేసుకోవాలి.

Telugu Curry, Curry Benefits, Detox, Tips, Latest-Telugu Health

అలాగే అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) వేసి మూత పెట్టి మరిగించాలి.ఆల్మోస్ట్ వాటర్ సగం అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆపై మరిగించిన వాటర్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఈ డ్రింక్ ను రోజు ఉదయం ఖాళీ కడుపుతో కనుక తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు తొలగిపోతాయి.

బాడీ డీటాక్స్ అవుతుంది.అలాగే ఈ డ్రింక్ ను డైలీ డైట్ లో చేర్చుకుంటే వెయిట్ లాస్ అవుతారు.

పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్ ఒక ఔషధంలా పనిచేస్తుంది.

రోజు ఈ డ్రింక్ ను తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.అంతేకాదు రెగ్యులర్ డైట్ లో ఈ డ్రింక్ ను చేర్చుకుంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

నోటి దుర్వాసన, నోటి పూత, చిగుళ్ళ నుండి రక్తస్రావం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు సైతం నయం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube