చైనాలో( China ) ఫిబ్రవరి 4న ఒక ఊహించని సంఘటన జరిగింది.బైలాంగ్( Bailong Horse ) అనే ఏడేళ్ల తెల్ల గుర్రం తన యజమానితో కలిసి నది దగ్గర శిక్షణ తీసుకుంటుండగా, ఒక వ్యక్తి బ్రిడ్జి మీద నుంచి నదిలో( River ) పడిపోయాడు.
ఆ వ్యక్తి కూతురు భయంతో కేకలు వేస్తూ సహాయం కోసం ఆర్తనాదాలు చేసింది.
క్షణం కూడా ఆలస్యం చేయకుండా, యిలిబాయి( Yilibai ) అనే ఆ గుర్రం యజమాని బైలాంగ్‌ను నదిలోకి దూకించాడు.
ఇంతకుముందు నీళ్లల్లోకి ఎప్పుడూ వెళ్లని బైలాంగ్ ఏమాత్రం భయపడకుండా 40 మీటర్ల దూరం వరకు ఈదుకుంటూ వెళ్లింది.యిలిబాయి ఒక చేత్తో పగ్గాలు పట్టుకుని, మరో చేత్తో మునిగిపోతున్న వ్యక్తిని( Drowning Man ) రక్షించాడు.
బైలాంగ్ చూపిన అద్భుతమైన ధైర్యం, యజమానిపై దానికున్న నమ్మకం వీడియో రూపంలో వైరల్( Viral Video ) అయింది.

అయితే, ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు.రెస్క్యూ( Rescue ) చేసిన ఆరు రోజులకే బైలాంగ్ ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది.ఆహారం తీసుకోవడం, విసర్జించడం మానేసి తీవ్రమైన జ్వరంతో బాధపడింది.
వెంటనే స్పందించిన అధికారులు పశువైద్యులను పంపించి చికిత్స అందించారు.కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు.
ఫిబ్రవరి 11న బైలాంగ్ కన్నుమూసింది.

గుర్రం మరణంతో యిలిబాయి గుండె పగిలినంత పనైంది.దుఃఖంతో మాట కూడా సరిగా రాలేదు.“మేమిద్దరం ఎన్నో కష్టసుఖాలు పంచుకున్నాం.దాని గురించి మాట్లాడొద్దు, నేను ఏడుస్తాను” అంటూ తన బాధను వ్యక్తం చేశాడు.
తన ప్రాణాలను కాపాడిన బైలాంగ్ మరణానికి కారణం తానేనని తెలుసుకున్న ఆ వ్యక్తి తీవ్రమైన అపరాధ భావనతో కుమిలిపోయాడు.“బైలాంగ్ చాలా తెలివైనది.నేను కొరడా ఇవ్వగానే అది నీళ్లలోకి వెళ్లాలని అర్థం చేసుకుంది.
ఆ వ్యక్తిని పట్టుకున్నాక, వెనక్కి తిరిగి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది.మేమిద్దరం కుటుంబంలా నమ్ముకున్నాం” అని యిలిబాయి గతంలో బైలాంగ్ గురించి గొప్పగా చెప్పాడు.
బైలాంగ్ ధైర్యానికి గుర్తుగా, జియాంటావో నగర ప్రభుత్వం రెస్క్యూ జరిగిన నది దగ్గర దాని విగ్రహాన్ని నిర్మించనుంది.







