చైనాలో( China ) ఓ చిన్నోడు చేసిన పనికి వాళ్ల నాన్నకు ఊహించని తిప్పలు వచ్చిపడ్డాయి.లూనార్ న్యూ ఇయర్( Lunar New Year ) సందర్భంగా తనకిచ్చిన లక్కీ మనీని( Lucky Money ) తన నాన్న దొంగిలించాడని పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్( Police Complaint ) పెట్టాడు ఈ బుడ్డోడు.
ఈ ఘటన చైనాలోని గాన్సు ప్రావిన్స్‌లోని లాన్‌జౌ నగరంలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే.
పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.చిన్న పిల్లాడు కంగారుగా ఫోన్ చేసి “మా ఇంట్లో ఒక బ్యాడ్ మ్యాన్ ఉన్నాడు.వాడు నా డబ్బులు దోచుకున్నాడు.” అని ఏడుస్తూ చెప్పాడు.అంతేకాదు, ఫోన్‌లోనే ఎవరో మనిషి గట్టిగా అరుస్తున్న శబ్దం కూడా పోలీసులకు వినిపించింది.“ఒరేయ్ తుంటరోడా.పోలీసులకే ఫోన్ చేస్తావా నువ్వు.” అని ఎవరో తిడుతున్నట్టు అరుపులు వినిపించాయి.
చైనాలో లూనార్ న్యూ ఇయర్ అప్పుడు పెద్దవాళ్లు పిల్లలకు రెడ్ ఎన్వలప్‌లలో( Red Envelope ) డబ్బులు పెట్టి ఇస్తారు.దాన్నే లక్కీ మనీ అంటారు.ఇది అదృష్టానికి, సిరిసంపదలకు గుర్తుగా భావిస్తారు.కానీ చాలా ఇళ్లల్లో పేరెంట్స్ ఏం చేస్తారంటే.
పిల్లలు ఆ డబ్బులు పోగొట్టుకుంటారని లేదా పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడతారని చెప్పి వాళ్లే ఆ డబ్బులు తీసుకుని దాచుకుంటారు.

ఇక్కడా అదే జరిగింది.బాబుగారికి మాత్రం ఇది నచ్చలేదు.తన డబ్బులు తన దగ్గరే ఉండాలి అనుకున్నాడు.
నాన్న రెడ్ ఎన్వలప్ తీసుకునేసరికి ఈ కుర్రాడు బాగా అప్సెట్ అయిపోయాడు.అంతే.
వెంటనే ఫోన్ తీసి పోలీసులకు కాల్ చేసేశాడు.పోలీసులు వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లారు.
పోలీసుల్ని చూడగానే ఆ పిల్లడు ఫుల్ హ్యాపీ.వాళ్ల నాన్నను చూపిస్తూ “పోలీసు అంకుల్ ఎంత తొందరగా వచ్చేశారు.
ఈ బ్యాడ్ మ్యాన్‌ను ఇప్పుడే అరెస్ట్ చేయండి ప్లీజ్!” అని చెప్పాడు అమాయకంగా.

ఇక తండ్రి అయితే బిత్తరపోయి, సిగ్గుతో తలదించుకున్నాడు.“సారీ ఆఫీసర్.మా వాడు ఇంకా చిన్న పిల్లాడు.
వాడికేం తెలీదు.వాడు నిజంగా పోలీసులకు ఫోన్ చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు” అని నసిగాడు.
అసలు విషయం తెలుసుకున్న ఆ పోలీస్ ఆఫీసర్ కూల్‌గా ఆ బుడ్డోడికి అర్థమయ్యేలా చెప్పాడు.“నీ డబ్బులు నాన్న దగ్గరే ఉండనివ్వు.నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్నను అడుగు.నీకు ఎంత ఖర్చు పెట్టావో నాన్న లెక్కలు రాసుకుంటాడు.ఓకేనా?” అని నచ్చజెప్పాడు.
తండ్రికి కూడా కొంచెం క్లాస్ పీకాడు పోలీస్ ఆఫీసర్.“పిల్లల్ని ఇలాంటి పనులు చేయకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి” అని చెప్పి సర్దిచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.







