Green Apple Cinnamon Tea :నైట్ ఈ `టీ` తాగితే ప్ర‌శాంత‌మైన నిద్ర మీసొంతం అవుతుంది!

నేటి ఆధునిక కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మందికి ప్రశాంతమైన నిద్ర కరువవుతోంది.అలాగే ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, మొబైల్ ఫోన్‌ను అధికంగా వినియోగించడం తదితర కారణాల వల్ల కూడా సుఖంగా నిద్రపోలేకపోతుంటారు.

 If You Drink This Tea At Night, You Can Get A Peaceful Sleep, Peaceful Sleep, Sl-TeluguStop.com

ఈ క్రమంలోనే నిద్ర పట్టడం కోసం చాలా మంది మందులు వాడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే `టీ` ని కనుక తీసుకుంటే ప్రశాంతమైన నిద్రను తమ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ టీ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గ్రీన్ యాపిల్ ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను కచ్చాపచ్చాగా దంచుకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న‌ ఆపిల్ ముక్కలు, రెండు దాల్చిన చెక్కలు, నాలుగు లవంగాలు వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసి మిక్స్ చేసుకుంటే గ్రీన్ ఆపిల్ దాల్చిన చెక్క టీ సిద్ధమవుతుంది.

Telugu Cinnamon, Sleep, Green Apple, Greenapple, Tips, Latest, Peaceful Sleep-Te

ఈ టీ రుచిగా ఉండ‌ట‌మే కాదు బోలెడ‌న్ని పోషకాలను సైతం కలిగి ఉంటుంది.ముఖ్యంగా నైట్ టైం ఈ గ్రీన్ యాపిల్ దాల్చిన చెక్క టీ తీసుకుంటే ఒత్తిడి, టెన్షన్, తలనొప్పి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరమై ప్రశాంతమైన నిద్ర పడుతుంది.అలాగే ఈ టీని తీసుకోవడం వల్ల పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.జలుబు దగ్గు వంటి సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.మరియు బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుముఖం పడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube