ఉద్యోగం కోసమో, ఉన్నత చదువుల కోసమో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయులు ఎంతోమంది.అయితే, వారు కొంత పరిమితి కాలం తరువాత వారి వారి పాస్పోర్ట్ ను రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుంది.
అలాగే వారి నివాసానికి సంబంధించిన విషయాలను కూడా వారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇటువంటివన్ని నిర్వహించేదే అమెరికా లోని, హ్యోస్టాన్ లోని కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా.
ఈ కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, నవంబర్ 12న కాన్సులర్ క్యాంపును ఏర్పాటు చేయనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు.
ఈ కాన్సులర్ క్యాంపు రాధాకృష్ణ టెంపుల్, మరియు ఇతర భారతీయ సంఘాల సహకారంతో నిర్వహించనున్నారు.
అల్లెన్ లోని రాధాకృష్ణ టెంపుల్ లో జరగనున్న ఈ క్యాంపు లో కాన్సులర్ సర్వీసులు అందించనున్నారు.అమెరికా పాస్పోర్ట్ కలిగిన భారతీయ సంతతి ఓవర్సీస్ సిటిజెన్ అఫ్ ఇండియా కార్డు, ఎమర్జెన్సీ వీసాలకు సంబంధించిన అప్లికేషన్స్ పరిశీలించనున్నట్టు ప్రకటనలో తెలిపారు.
ఈ క్రమంలోనే భారతీయ పాస్పోర్ట్ కలిగిన ఎన్ఆర్ఐల పాస్పోర్ట్ రెన్యువల్ అప్లికేషన్స్, జీఈపీ మరియు పీసిసి తదితర అప్లికేషన్స్ ను వెరిఫై చేయనున్నట్టు వివరించారు.
ఈ సేవలును పొందాలనుకునే వారు ఆయా సంబంధిత పత్రాలతో క్యాంపునకు హాజరు కాగలరని కోరారు.వీటితో పాటు మరొక ముఖ్య విషయాన్నీ కూడా స్పష్టం చేశారు, ఇప్పుడు నిర్హహిస్తున్న క్యాంపు అప్లికేషన్స్ ను స్వీకరించాటానికే తప్ప తక్షణమే ఎలాంటి సేవలను జారి చేయలేరని చెప్పారు.అయితే ఈ సేవలకు సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటె వాటిని కూడా నివృత్తి చేస్తారని తెలిపారు.
క్యాంపు గురించి మరింత సమాచారం కోసం www.radhakrishnatemple.net వెబ్సైటు సందర్శించాలని పేర్కొన్నారు.