1.వైసిపి కి విజయమ్మ రాజీనామా
ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ నేడు ప్లీనరీలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
2.రాజ్యసభ ఎంపీగా లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ బిజెపికి చెందిన సీనియర్ నేత లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు.
3.సీఎం నివాసం పై ఈడీ దాడులు
జార్ఖండ్ సీఎం హేమంత్ హెరెన్ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దాడులు నిర్వహించారు.
4.బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్ప పీడనం తో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
5.దసరా రోజు సంచలన ప్రకటన చేస్తా : జగ్గారెడ్డి
దసరా రోజున తాను సంచలన ప్రకటన చేయబోతున్నట్లు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
6.కాలేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
కాలేశ్వరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది.అధికారులు ప్రాజెక్టుకు ఉన్న 35 గేట్లను ఎత్తివేశారు.
7.పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ హెచ్చరించారు.
8.నుపూర్ శర్మ కు మద్దతుగా పెడుతున్న పోస్టులపై నిఘా
బిజెపి బహిష్కృత నేత మహమ్మద్ ప్రవక్త వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగులపై నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు.డిజిపి ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు వారు తెలిపారు. 9.జహీరాబాద్ లో పీకే టీం పర్యటన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీం సభ్యులు ఈ రోజు జహీరాబాద్ నియోజకవర్గం లో పర్యటించారు.
10.వైసీపీ ప్లీనరీ పై అచ్చెన్న కామెంట్స్
ఈరోకు వైసిపి ప్లీనరీ సమావేశం ఘనంగా నిర్వహించారు.దీనిపై ఏపీ టిడిపి అధ్యక్షుడు నాయుడు స్పందించారు.వైసిపి ప్లేనరీ కాదు డ్రామా గ్యాలరీ అంటూ ఎద్దేవా చేశారు.
11.కోడిపందాలపై చింతమనేని ప్రభాకర్ కామెంట్స్
కోడిపందాలు అంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని అది చట్ట విరుద్ధమని తెలిసినా, అది తన వీక్ నెస్ అని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
12.ఎమ్మెల్యే సీతక్క కన్నీరు
ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కన్నీటి పర్యంతం అయ్యారు.ఆదివాసీలపై అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించడం పై ఆమె ఆవేదన చెందారు.
13.వైఎస్ఆర్ కు కేసిఆర్ తీరని అన్యాయం చేశారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి తెలంగాణ సీఎం కేసీఆర్ తీరని అన్యాయం చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
14.సింగరేణి పాత గని ఏరియా
సింగరేణి భూ గర్భానికి చెందిన ప్రాంతంలో భారీ ఎత్తున భూమి కుంగిపోయింది.దీంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు.
15. వైరాలో భారీ వర్షం.వింత చేపలు
తెలంగాణలోని వైరా లో భారీ వర్షం కురిసింది.ఈ వర్షంతో పాటు పెద్ద ఎత్తున చేపలు ఈ వర్షం తో పాటు కిందపడ్డాయి.
16.సినీ హీరో ప్రభు , ఆయన సోదరిడి పై కేసు నమోదు
ఆస్తి తగాదాల కేసులో సినీ నటుడు ప్రభు, ఆయన సోదరుడు రామ్ కుమార్ లపై మద్రాస్ హైకోర్టులో కేసు నమోదు అయ్యింది.
17.ఈటెల రాజేందర్ కామెంట్స్
సమాజం త్యాగాలపై ఏర్పడిందని త్యాగాలు లేకపోతే వ్యర్ధమని బిజెపి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
18.అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో విక్రమ్
విలక్షణ నటుడు హీరో విక్రమ్ అనారోగ్యం పాలయ్యారు.దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నై లోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.
19.అభ్యంతరం ఎన్నికలు పెట్టాలంటూ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్
మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు పెట్టాలంటూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.
20.ఎంపీ రఘురామ క్వాష్ పిటిషన్ కొట్టివేత
వైసిపి ఎంపీ రఘురాం కృష్ణంరాజు క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది.