హెయిర్ ఫాల్ సమస్య( Hairfall Problem ) బాగా విసిగిస్తుందా.? ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడం లేదా.? రకరకాల హెయిర్ ప్యాక్ లు, మాస్కులు వేసుకున్నా సరే ఉపయోగం ఉండడం లేదా.? వర్రీ వద్దు తల స్నానం చేసేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ట్రిక్ ను పాటిస్తే ఒక్క వెంట్రుక కూడా రాలదు.హెయిర్ ఫాల్ సమస్య దెబ్బకు కంట్రోల్ అవుతుంది.మరి ఇంతకీ జుట్టు రాలడాన్ని అరికట్టే ఆ ట్రిక్ ఏంటో లేట్ చేయకుండా తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి ఉడికించాలి.దాదాపు ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టాప్ ఆఫ్ చేసుకుని వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) తో పాటుగా మీ రెగ్యులర్ షాంపూను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల చొప్పున వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.
ఇలా వారానికి రెండు సార్లు కనుక చేస్తే హెయిర్ ఫాల్ సమస్య చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ గా మారతాయి.
అలాగే జుట్టులో మెలనన్ ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది.దాంతో తెల్ల జుట్టు( White Hair ) వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.అంతేకాదు తల స్నానం చేసేటప్పుడు పైన చెప్పుకున్న సింపుల్ ట్రిక్ ను పాటిస్తే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.ఆపిల్ సైడర్ వెనిగర్ స్కాల్ప్ ను లోతుగా శుభ్రం చేసి హెల్తీ గా మారుస్తుంది.
చుండ్రు సమస్య ఉన్నాసరే దూరం చేస్తుంది.