టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.కోర్టు నంబర్ ఆరులో 63వ ఐటెంగా ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే.
అయితే జాబితాలో చిట్ట చివరి కేసు 63వ నంబర్ గా చంద్రబాబు కేసు ఉంది.పిటిషన్ జాబితాలో ఆఖరులో ఉండటంతో విచారణకు వస్తుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
కాగా ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది బెంచ్ విచారించనుంది.ఈ క్రమంలో చంద్రబాబు కేసు విచారణకు వస్తుందా ? లేదా అన్ని విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.