ఈ సమస్య పరిష్కారానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళితే ఖరీదైన మరియు కఠినమైన కెమికల్స్ ఉండే మందులకు వాడవలసి ఉంటుంది.మీరు ఎక్కువ ఖర్చు పెట్టకుండా, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి కొన్ని నివారణలను ఇంటిలో ప్రయత్నం చేయవచ్చు.
ఈ సహజ ఉత్పత్తులు చాలా వరకు మీకు మీ వంటగదిలోనే అందుబాటులోనే ఉంటాయి.ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే సులభంగా మార్కెట్ లో దొరుకుతాయి.వీటి వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.
1.బంగాళదుంప
హైపర్ పిగ్మెంటేషన్ వలన వచ్చే టాన్, నల్లని మచ్చలను తొలగించుకోవటానికి ఇది బాగా ప్రసిద్ది చెందిన చికిత్స అని చెప్పవచ్చు.
కావలసినవి :
బంగాళదుంప సగం ముక్క ( చీలికలుగా కోయాలి)
చేసే విధానం :
* బంగాళదుంప ముక్కను సన్నని ముక్కలుగా కోయాలి
* ప్రభావిత ప్రాంతాన్ని ఈ ముక్కలతో సున్నితంగా రబ్ చేయాలి
* రబ్ చేసిన తర్వాత 15 నిముషాలు అలా వదిలేయాలి
* ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి
* ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది
అలాగే మీరు బంగాళదుంప రసాన్ని తీసి ప్రతి రోజు ప్రభావిత ప్రాంతంలో రాసిన మంచి పలితాన్ని పొందవచ్చు.
2.తేనె మరియు నిమ్మకాయ రసం
తేనెలో తేమ గుణాలు ఉంటే నిమ్మకాయ సహజ బ్లీచ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.(నిమ్మరసంలో నీటిని కలపాలి.ఎందుకంటే నిమ్మలో ఉండే ఆమ్లం చర్మానికి చికాకును కలిగిస్తుంది)హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి ఒక సులభమైన పద్ధతి గురించి తెలుసుకుందాం.
కావలసినవి :
నిమ్మ రసం – 2 స్పూన్స్
తేనే – 2 స్పూన్స్
చేసే విధానం:
ఒక బౌల్ లో నిమ్మరసం,తేనే తీసుకోని బాగా కలిపి ప్రభావిత ప్రాంతంలో రాసి 20 నిముషాలు అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ఒక నెల పాటు ప్రతి రోజు చేస్తే మంచి పలితం కనపడుతుంది.