వేపాకు.దాదాపు అందరికీ అందుబాటులో ఉంటుంది.వేపాకు రుచికి చేదుగా ఉన్నా.ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.అలాగే జుట్టు సంరక్షణకు సైతం ఉత్తమంగా సహాయపడుతుంది.ముఖ్యంగా వేపాకును ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే పల్చటి జుట్టు రెండు నెలల్లోనే ఒత్తుగా పొడుగ్గా మారుతుంది.
ఇంకెందుకు ఆలస్యం వేపాకును ఎలా వాడితే జుట్టు ఒత్తుగా మారుతుందో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక కప్పు వేపాకును కడిగి పెట్టుకోవాలి.
అలాగే ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, ఒక కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కడిగి పెట్టుకున్న వేపాకును వేసుకోవాలి.
అలాగే నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్మూత్ పేస్ట్ ను స్టైనర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ స్మూత్ పేస్ట్ లో నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, నాలుగు నుంచి ఐదు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు ఆవ నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా పెరుగుతుంది.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.
చుండ్రు నుంచి సైతం విముక్తి లభిస్తుంది.కాబట్టి ఒత్తయిన జుట్టు కావాలని ఆరాటపడుతున్న వారు తప్పకుండా వేపాకుతో పైన చెప్పిన రెమెడీని పాటించండి.