సూపర్ స్టార్ మహేష్ బాబు 47 ఏళ్ల వయసులో కూడా ఎంతో హుషారుగా సినిమాలు పూర్తి చేస్తున్నాడు.ఇటీవలే సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఈ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇక ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమాను ప్రకటించి అదే జోష్ లో పూర్తి చేస్తున్నాడు.
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ”SSMB28”.
ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.
ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయడం కోసం మహేష్ రాత్రి పగలు కష్ట పడుతున్నాడు.అందుకే షెడ్యూల్స్ గ్యాప్ లేకుండా పూర్తి చేస్తున్నాడు.

ఒక షెడ్యూల్ పూర్తి కాగానే వెంటనే మరో షెడ్యూల్ మొదలు పెట్టాడు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తి కాగా మరో షెడ్యూల్ కోసం టీమ్ అంతా సిద్ధం అవుతుంది.నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల మూడవ వారంలో స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు నిర్మాత ఇటీవలే అఫిషియల్ గా తెలిపాడు.

ఈ క్రమంలోనే ఈ రిలీజ్ డేట్ లో ఎటువంటి మార్పులు లేకుండా ఫాస్ట్ గా షూట్ పూర్తి చేసి అదే డేట్ కు రిలీజ్ చేయాలని బాగా ఫిక్స్ అయ్యారట.అందుకే ఫాస్ట్ గా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు.ప్రెజెంట్ వెకేషన్ లో ఉన్న మహేష్ అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొన నున్నాడు అని టాక్.అందుకు మేకర్స్ కూడా హైదరాబాద్ లో భారీ సెట్టింగ్స్ సిద్ధం చేస్తున్నారట.







