గర్భగుడి వెనుక నమస్కరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.భక్తులందరూ వివిధ రకాల కోరికలతో గుడికి వెళ్లి స్వామి వారి దగ్గర వారి కోరికను తెలుపు కుంటారు.

 Why The People Praise Temple Back Side Temple Backside, Namaskar, Hindu Rituals-TeluguStop.com

గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు గర్భ గుడి వెనుక భాగాన్ని నమస్కరిస్తూ వెళ్తుంటారు.అలా నమస్కరించడం వెనుక గల కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా?

ప్రతి ఒక్క దేవాలయంలోనూ భక్తులందరూ ఇలా నమస్కరించడం చూస్తుంటారు.ఎందుకు అలా నమస్కరిస్తున్నారు అని ఎవరైనా అడిగితే దాని వెనుక ఉన్న కారణం ఎవరికీ తెలియదు.అయితే గర్భగుడి వెనుక భాగం నమస్కరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

మన పూర్వీకులు నుంచి ప్రతి ఒక్కరూ దేవాలయం వెనుక భాగంలో నమస్కరిస్తూ ఉంటారు కాబట్టి, ఇప్పుడు మనం కూడా అదే ఆచరిస్తున్నాం అని చెబుతారు.

మరికొందరైతే ఇలా చేయడం వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి నమస్కరిస్తున్నాను అని చెబుతారు.కాని దాని వెనుక బలమైన కారణం ఉందని జ్యోతిష్యులు వేద పండితులు చెబుతున్నారు.

సాధారణంగా గర్భ గుడిలో దేవుని విగ్రహం వెనుక వైపు గోడకి కొద్దిగా దగ్గరగా ప్రతిష్టిస్తారు.మూల విరాట్ కు నిత్య పూజలు అభిషేకాలు, నిత్యం మంత్రార్చన చేయడంవల్ల, స్వామి వారి పాద పీఠం కింద ఉన్న యంత్రంలోకి మంత్ర శక్తి ప్రవేశించడం వల్ల ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది.

ఆ శక్తి గర్భగుడి నాలుగు మూలలు వ్యాపిస్తాయి.అయితే ఈ మంత్ర శక్తి కి అత్యంత సమీపంలో ఉండేది మూలవిరాట్ వెనక ఉన్న గోడ, కాబట్టి ఆ గోడ ఎక్క వెనుక భాగం శిల్పాన్ని చెక్కుతారు.

అక్కడికి వచ్చే భక్తులు, ఆ విగ్రహానికి నమస్కరించడం వల్ల స్వామి వారి శక్తి వారికి కలుగుతుందని ఆ శక్తిని పొందడానికి వీలుగా ఉంటుందని, గర్భ గుడి వెనుక భాగాన్ని నమస్కరిస్తారు.చూశారు కదా గర్భ గుడి వెనుక నమస్కరించడం వల్ల ఎంతటి గొప్ప పుణ్యం కలుగుతుందో…

.

Why The People Praise Temple Back Side Temple Backside

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube