లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా గెస్ట్ రోల్‌తో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి మహేష్ బాబు వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి తేజస్వి మదివాడ ( Tejaswi Madivada ) ఒకరు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె మనం, హార్ట్ ఎటాక్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఐస్‌క్రీం వంటి చిత్రాలతో ఆకట్టుకుంది.
వరుస సినిమాలలో నటిస్తూ బోల్డ్ సన్నివేశాలలో ప్రేక్షకులను సందడి చేసిన తేజస్వి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా కనిపించేవారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నిత్యం హ్యాపీగా ఉంటూ హాట్ ఫోటోలను షేర్ చేస్తుండే ఈమె బిగ్ బాస్( Bigg Boss ) అవకాశాన్ని అందుకున్నారు.ఇలా బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె త్వరలోనే హీరో నవదీప్( Navadeep ) తో ఏడడుగులు వేయబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.ఇలా ఈమె పెళ్లి ( Marriage ) గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలోకి పెళ్లి వార్తలపై తేజస్వి స్పందించారు.

ఒక ఇంటర్వ్యూలో తేజస్వీ మాట్లాడుతూ.తన జీవితం తెరిచిన పుస్తకమని.బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానంటూ చెప్పుకొచ్చింది.తన బాయ్ ఫ్రెండ్ ను కూడా కోల్పోయానని స్పష్టం చేసింది.నవదీప్ తనకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమేనని తెలిపారు.క్లోజ్ గా ఉంటే పెళ్లి చేసుకోవాల అంటూ ప్రశ్నించింది.
దీంతో ఈమె పెళ్లి వార్తలకు ఇప్పటితో ఫుల్ స్టాప్ పడుతుందని తెలుస్తోంది.ఇక నవదీప్ కూడా తన పెళ్లి గురించి ఓపెన్ కామెంట్ చేస్తూనే ఉంటారు.
ఇక వీరిద్దరి పెళ్లి గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని వీరిద్దరూ మంచి స్నేహితులని స్పష్టమవుతుంది.