అధిక శారీరక శ్రమ, పోషకాల కొరత, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎండల ప్రభావం తదితర కారణాల వల్ల ఒక్కోసారి చాలా నీరసంగా( Fatigue ) మారిపోతుంటారు.ఏ పని చేయలేకపోతుంటారు.
కళ్ళు తిరిగి పోతూ ఉంటాయి.అలాంటి సమయంలో నీరసాన్ని తరిమి కొట్టేందుకు, శరీరానికి తిరిగి సంపూర్ణ శక్తిని అందించేందుకు ఇప్పుడు చెప్పబోయే క్యారెట్ షేక్( Carrot Shake ) చాలా అంటే చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
మరి ఇంతకీ ఆ క్యారెట్ షేక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ లో రెండు వాల్ నట్స్, పది బాదం గింజలు( Almonds ) వేసి వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
మరొక గిన్నెలో మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు,( Dates ) ఐదారు నల్ల ఎండు ద్రాక్ష( Black Raisins ) వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.ఈలోపు ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను ఆవిరిపై ఉడకపెట్టి చల్లారబెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే నానబెట్టి పొట్టు తొలగించిన బాదం గింజలు, వాల్ నట్స్, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు వేసుకోవాలి.వీటితో పాటు ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు, ఒక టీ స్పూన్ ఆర్గానిక్ బెల్లం పొడి వేసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన హెల్తీ అండ్ సూపర్ టేస్టీ క్యారెట్ షేక్ అనేది రెడీ అవుతుంది.ఒక్క గ్లాస్ ఈ క్యారెట్ షేక్ ను తాగారంటే ఎలాంటి నీరసం అయినా ఖేల్ ఖతం అవ్వాల్సిందే.

ఈ క్యారెట్ షేక్ శరీరానికి తక్షణ శక్తిని చేకూరుస్తుంది.నీరసం, అలసటను తొలగిస్తుంది.బాడీని ఫుల్ ఎనర్జిటిక్ గా మారుస్తుంది.ఎదుగుతున్న పిల్లలకు కూడా ఈ షేక్ ను ఇవ్వొచ్చు.అలాగే ఈ క్యారెట్ షేక్ రక్తహీనత నివారణలో సహాయపడుతుంది.ఎముకలను బలోపేతం చేస్తుంది.
కండరాల నిర్మాణానికి మద్దతు ఇస్తుంది.ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.
మరియు మెదడును షార్ప్ గా కూడా మారుస్తుంది.కాబట్టి ఇకపై ఎప్పుడైనా నీరసం కుమ్మేస్తున్నప్పుడు ఈ క్యారెట్ షేక్ ను ట్రే చేయండి.