జీవితంలో ప్రమాదం అన్నది ఏ విధంగా అయినా కూడా రావచ్చు.అయితే దానికి కారణాలు మనిషికి తెలిసి ఉండవు.
అయితే ఇంట్లో జరిగిన ప్రతి ప్రమాదానికి కూడా వాస్తు దోషాలు( Vastu ) మాత్రం తప్పకుండా ఉంటాయి.ఇక కర్మ వల్ల వచ్చే ఇబ్బందులకు మనిషి వక్రబుద్ధి తోడైతే ఎవరు చెప్పినా వినకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది.
కొన్ని కార్యాలు ప్రకృతి ధర్మంగా జరుగుతుంటాయి.అయితే వాటికి కారణాలు భౌతికంగా ఉండవచ్చు.
ఇటు పౌరా ఆర్థికంగా కూడా ఉండవచ్చు.ఎలాగైనా నష్టం నష్టమే అని చెప్పుకోవాలి.
ఇంట్లో కాని ఆవరణలో కానీ ఆగ్నేయం, వాయువ్యంలో ఎలాంటి లోపాలు ఉన్నా కూడా ఇలాంటి అగ్ని కార్యాలు( Fire Accident ) నష్టం తెస్తాయి.

ముఖ్యంగా విశాలమైన స్థలంలో ఇల్లు కట్టినప్పుడు దానికి చుట్టూ ప్రత్యేకంగా ప్రహరీ కూడా నిర్మించాలి.ఇక శాస్త్రం ప్రకారం గృహ నిర్మాణం( House Construction ) జరగాలి.అంతేకాకుండా ఇంటికి ఆగ్నేయంలో పెద్ద బావి లేదా గోబర్ గ్యాస్ ప్లాంట్, సెప్టిక్ ట్యాంక్ లాంటివి లేకుండా చూసుకోవాలి.
అలాగే వ్యవసాయ భూముల్లో ఇండ్లు ఎత్తుగా కట్టినప్పుడు పిడుగులు పడకుండా, సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం మంచిది.నిర్మాణం ఏదైనా కూడా తప్పక వాస్తు చూడాలి.అలా నిర్మాణాన్ని వాస్తు ప్రకారం నిర్మించినప్పుడే ఆనందం, ప్రశాంతత కలుగుతుంది.అందులో ఉండబుద్ధి కావాలి.
అలాగే మంచి గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.

చుట్టూ చెట్లు పచ్చదనం ఆవరించి ఉండేలా కూడా చూసుకోవాలి.దానికోసం వాస్తు అమరిక ఎంతో దోహదపడుతుంది.చాలామంది ఎన్నో నిర్మాణాలు చేస్తారు.
కానీ అందులో ఈశాన్యం, నైరుతిలో టాయిలెట్లు ఏర్పాట్లు చేస్తారు.అయితే ఇలా ఈ దిశలో టాయిలెట్లను నిర్మించడం చాలా ప్రమాదం అని చెప్పాలి.
ఎప్పుడైనా వాయువ్యం లో టాయిలెట్లు నిర్మించాలి.ఉత్తర ఈశాన్యంలో ద్వారాలు పెట్టాలి.
అలాగే దక్షిణ ఆగ్నేయంలో ద్వారం ఉండాలి.ఈ విధంగా ఉంటేనే మనకు నిర్మాణం అన్ని విధాలుగా కలిసి వస్తుంది.ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉంటుంది.