కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన పాండవులు ఎంతో సంతోషంతో హస్తినాపురంలోని ధర్మరాజుకు పట్టాభిషేకం నిర్వహించారు.అయితే తన కొడుకుల్ని పోగొట్టుకున్న గాంధారి వీరి సంతోషాన్ని భరించలేకపోయింది.
ఇక శ్రీకృష్ణ పరమాత్ముడికి యుద్ధం ఆపే శక్తి ఉన్నప్పటికీ కురువంశ వినాశనాన్ని చూస్తూ ఉండిపోయిన శ్రీకృష్ణునిపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది.ఏ విధంగా అయితే వంద మంది కొడుకులను పోగొట్టుకొని ఆ బాధను భరిస్తూ ఉందో అదేవిధంగా కృష్ణుడు ఏలిన ద్వారక నగరం కూడా నాశనమవుతుందని గాంధారి శపించింది.
గాంధారి క్షణికావేశంలో అన్న ఆ మాటలు నిజమే అయ్యి తన కళ్ళముందే ద్వారకానగరం సముద్రగర్భంలో కలిసి పోవడం చూడటం ఇష్టంలేక శ్రీకృష్ణుడు ద్వారకా నుంచి తపోవనం వెళ్ళిపోయాడు.తపోవనంలో తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు.
ద్వారకాలో కృష్ణుడు తండ్రి మరణించడంతో అతని అంత్యక్రియలు కోసం బలరాముడు కూడా లేకపోవడంతో వసుదేవుడి అంత్యక్రియలు అర్జునుడే జరిపించాడు.ఈ విషయాన్ని శ్రీ కృష్ణునికి చెప్పాలని అర్జునుడు కృష్ణుని వెతుక్కుంటూ బయల్దేరతాడు.

శ్రీకృష్ణుడి కోసం అర్జునుడు రెండు రోజుల పాటు వెతకగా చివరికి శ్రీ కృష్ణుడు ప్రాణం లేకుండా కనిపించడంతో అర్జునుడు హతాశయుడైపోయాడు.కుమిలిపోయాడు.రోదించాడు.అది శ్రీకృష్ణ కళేబరం కాదని భావించినప్పటికీ అది నిజం.అడవిలో బోయవాడి బాణం కృష్ణుడి కాలికి తగలడం వల్ల ప్రాణాలు వదిలి నాలుగు రోజులు కావడంతో అతని మృతదేహాన్ని కూడా తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.ఆ సమయంలో ఏ శాస్త్రము, ఏ ఆర్భాటమూ లేకుండా కేవలం అర్జునుడు మాత్రమే శ్రీకృష్ణుని అంత్యక్రియలను పూర్తి చేశాడు.
శ్రీకృష్ణుడికి ఎంతో బలగం ఉన్న తన అంత్యక్రియలలో ఎవరు పాల్గొనలేదు.అంత జనం ఉండి చివరకు ఒక అనాధల మరణించిన శ్రీకృష్ణుడికి అర్జునుడు అంత్యక్రియలను జరిపాడు.
అప్పట్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులకు నిదర్శనంగా చెప్పవచ్చు.