లక్ష్మీ దేవిని కోరుకోని వారుండరు.లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఏవేవో పూజలు పునస్కారాలు చేయడం కూడా మనకు అలవాటే.
ఎందుకంటే సకల సంపదలను ఇచ్చే దేవత లక్ష్మీ దేవి కాబట్టి.అయితే కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీ దేవి మన ఇంటిని వదిలి వెళ్లదట.
అంతే కాదండోయ్ ఆ అమ్మవారి అనుగ్రహం ఎల్ల వేళలా మనతోనే ఉంటుందట.అయితే ఆ వస్తువులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణావర్త శంఖం, ముత్యం శంఖం, ఏకాక్షి నారికేళం, మారేడు కాయ, పసుపు, కుంకుమలు, తాటాకులను ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీ దేవి మన ఇంటిని వదిలి వెళ్లదు.ముఖ్యంగా ఈ వస్తువులను పూజ గదిలో ఉంచుకోవాలి.
దక్షిణావర్త శంఖం కడుపు ఊదే వారి కుడివైపుకు తెరచుకుని వుంటుంది.అలాగే దీనికి వ్యతిరేక దిశలో తెరుచుకొని ఉండేదాన్ని వామావర్తి శంఖమని అంటారు.
లక్ష్మీ దేవి లాగే ఈ శంఖాలు కూడా సముద్రం నుంచే వచ్చాయి.కాబట్టి ఇవంటే అమ్మవారికే చాలా ఇష్టం.
అందుకే వీటిని ఇంట్లో ఉంచుకోవాలి.అంతే కాదండోయ్ దక్షిణావర్త శంఖాన్ని లక్ష్మీ దేవి సోదరిగా చెప్తుంటారు.
అయితే పగిలిపోయిన, విరిగిపోయిన శంఖాలను ఇంట్లో పెట్టుకోకూడదు.ఏకాక్షి నారికేళం అంటే… ఒకే కన్ను ఉన్న కొబ్బరి కాయ.కానీ అరుదుగా దొరికే ఈ ఏకాక్షి నారికేళానికి ఒకే కన్ను ఉంటుంది.అయితే దీనికి బొట్టు, పసుపు, కుంకుమ, వేసి పూజ చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
అంతే కాదండోయ్ ఈ పూజ చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని… ధన లాభం చేకూరుతుందని నమ్మకం.