టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )వ్యూహాలు ప్రణాళికలు చాలా సందర్భాల్లో ఎవరికి అంతుచిక్కవు.అందుకే ఆయనను రాజకీయాల్లో అపార చాణక్యుడిగా చెబుతూవుంటారు.
ఇక తాజాగా ఆయన వేసిన మరో ప్లాన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.ఈసారి ఇటు ఇటు ఏపీలోనూ అటు తెలంగాణలోనూ సత్తా చాటలని చంద్రబాబు మొదటి నుంచి భావిస్తూ వచ్చారు.
ఏపీలో అధికారమే లక్ష్యమైతే.తెలంగాణలో కింగ్ మేకర్ కావలనేది ఆయన టార్గెట్.
అందుకే ఆ మద్య తెలంగాణపై గట్టిగా ఫోకస్ చేస్తూ వరుస పర్యటనలు, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్త్గు వచ్చారు.కానీ అనూహ్యంగా ఆయన స్కిల్ స్కామ్ లో జైలుపాలు కావడంతో భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా హోల్డ్ లో పడింది.

ఈ నేపథ్యంలో మరో నెల రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి.మరి టీడీపీ తెలంగాణ ఎన్నికల( TDP Telangana Elections ) వారిలో ఉంటుందా లేదా ? అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో మొదలౌతూ వచ్చాయి.అయితే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అన్నీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని, పొత్తులపై కూడా తుది నిర్ణయం తీసుకుంటామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ( Kasani Gnaneshwar )ఆ మద్య చెప్పుకొచ్చారు, కానీ చంద్రబాబుతో జైల్లో ఈ విషయంపై చర్చించిన తరువాత వ్యూహాలన్నీ మారిపోయాయి.తెలంగాణ ఎన్నికల్లో పార్టీని దూరంగా ఉంచాలని చంద్రబాబు సూచించారట.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ( TDP ) తెలంగాణలో పోటీ చేయడం వల్ల ఒరిగేదెమి లేదని, దానికి తోడు నెల రోజుల్లోనే ఎన్నికలు ఉండడంతో.చంద్రబాబు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో నామమాత్రంగా పోటీ చేయడం కన్నా పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉండడమే మంచిదనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు టాక్.ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరమైతే.ఆ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపనుందనేది ? ఆ పార్టీ ఓటు బ్యాంకు ఎటువైపు మల్లనుంది ? అనేది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం ఏపీలో టీడీపీ జనసేన పార్టీలు ( TDP Janasena parties )పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.అందువల్ల టీడీపీ ఓటు బ్యాంకు జనసేన వైపు మల్లె అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.
ఇక తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల ఆ ప్రభావం ఏపీ ఎన్నికల్లో కూడా టీడీపీ పై పడే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం మరి ఏం జరుగుతుందో చూడాలి.