కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని సినిమా పరిశ్రమ పూర్తిగా మూతపడ్డది.నెల రోజుల పాటు థియేటర్లు ఓపెన్ అయినా.
భారీ సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు.వచ్చినా చిన్నా చితకా సినిమాలే.
పలువు హీరోలు చాలా కిందట సక్సెస్ కొట్టినా.మళ్లీ ఎప్పుడు సక్సెస్ కొడతారో తెలియని పరిస్థితి నెలకొంది.
గతంలో చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడం.ఆ తర్వాత చేస్తున్న సినిమాలు లాక్ డౌన్ దెబ్బకు బ్రేకప్ కావడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.ఇంతకీ అలా సతమతం అవుతున్న నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
అఖిల్
మిస్టర్ మజ్నూ వచ్చి రెండు ఏండ్లు పూర్తయ్యింది.మూడో సినిమా ఫ్లాప్ గా నిలిచింది.దీంతో నాలుగో సినిమాతోనైనా విజయం సాధించాలని భావిస్తోంది.
తాజాగా కుర్ర హీరో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు.పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తుంది.
ఈ క్రేజీ ప్రాజెక్టు ముగింపుదశకొచ్చి ఏడాదయ్యింది.రెండు లాక్ డౌన్లతో ఆ సినిమా అలాగే నిలిచిపోయింది.
నాని
నేచురల్ స్టార్ సిట్యువేషన్ కూడా దాదాపుగా అలాగే ఉంది.తన సిల్వర్ జూబ్లీ మూవీని కరోనా కారణంగా ఓటీటీకి ఇచ్చారు.తర్వాత మూవీని మంచి హిట్ సాధించాలని భావిస్తున్నాడు.శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ మూవీని అంతే సీరియస్ గా కంప్లీట్ చేశారు.కానీ.నానీని సెకండ్ వేవ్ కూడా వెంటాడుతోంది
గోపీచంద్
ఆరేళ్ళ కిందటి జిల్ తర్వాత గోపీచంద్ కెరీర్ లో సరైన హిట్ కొట్టలేదు.ఆక్సిజన్, పంతం లాంటి సినిమాలు కూడా అంతగా సక్సెస్ కాలేదు.ఈ సారి గౌతమ్ నందా ఫేమ్ సంపత్ నందితో సీటిమార్ మూవీకి సాలిడ్ ఎఫర్ట్ పెట్టారు.
కబడ్డీ నేర్చుకునిమరీ పక్కా ప్రొఫెషనల్ గా సెట్స్ లోకెళ్ళేవారు.బట్.సీటిమార్ కి రిలీజ్ యోగం ఎప్పుడన్నది తెలియడం లేదు.
బాలయ్య
సీనియర్ హీరోలతో పోలిస్తే బాలయ్య పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉంది.అఖండ మూవీతో కష్టాలను తొలగించుకోవాలి అనుకుంటున్నాడు.బోయపాటి కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అఖండ విడుదలకు మార్గం దొరకాలంటే ఇంకెంత కాలం వెయిట్ చేయాలో తెలీయని పరిస్థితి నెలకొంది.