ఎసిడిటీతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే!

ఎసిడిటీ..

 Simple Tips To Get Rid Of Acidity Problem , Acidity, Acidity Symptoms, Acidity-TeluguStop.com

( Acidity ) చాలా మంది చాలా కామన్ గా ఫేస్ చేసే జీర్ణ సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి.ఏదైనా ఆహారం తీసుకోగానే పుల్లటి త్రేన్పులు, గుండెలో మంట, చిరాకు, కడుపులో మంట, ఆహారం నోటిలోకి వచ్చినట్లు ఉండ‌టం, ఛాతీలో మంట‌ వంటివి ఎసిడిటీ లక్షణాలు.

ఎసిడిటీ సమస్య ఉంటే ఏం తినాలన్నా భయపడుతుంటారు.ఈ క్రమంలోనే ఎసిడిటీ సమస్యను వదిలించుకునేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.

మీరు కూడా తరచూ ఎసిడిటీతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను మీరు తెలుసుకోవాల్సిందే.ఈ చిట్కాలతో ఈజీగా ఎసిడిటీకి బై బై చెప్పవచ్చు.ఎసిడిటీతో బాధ‌ప‌డుతున్నవారు ప్రతిరోజు ఉదయం నాలుగు పుదీనా ఆకుల( Mint leaves )ను నోట్లో వేసుకుని నమిలి తినాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్ ను సేవించాలి.ఇలా కనుక చేస్తే పుదీనా ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఎసిడిటీ సమస్యను సమర్థవంతంగా నివారిస్తాయి.

Telugu Acidity, Acidity Tips, Problems, Tips, Latest-Telugu Health

అలాగే జీర్ణక్రియ రేటును పెంచే సామర్ధ్యం దాల్చిన చెక్కకు ఉంది.అందువల్ల ఆంగ్లం దాల్చిన‌ చెక్కను ( Cinnamon )ఒక గ్లాసు వాటర్ లో వేసి బాగా మరిగించి ఆ నీటిని తీసుకోవాలి.ఇలా కనుక చేస్తే ఎసిడిటీ మాత్రమే కాదు గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్య‌లు సైతం వేధించకుండా ఉంటాయి.

Telugu Acidity, Acidity Tips, Problems, Tips, Latest-Telugu Health

ఉసిరి పొడి కూడా ఎసిడిటీ( Acidity ) సమస్యకు చెక్ పెడుతుంది.వన్ టేబుల్ స్పూన్ ఉసిరి పొడిలో( Amla Powder ) రెండు టేబుల్ స్పూన్ల తేనె( Honey ) కలిపి తీసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే ఎసిడిటీ సమస్యకు బై బై చెప్పవచ్చు.

ఇక భోజనం చేయడానికి గంట ముందు ఒక గ్లాస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలిపి తీసుకోండి.ఇలా కనుక చేస్తే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది.ఎసిడిటీ సమస్య వేధించకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube