తమ ముఖ చర్మం వైట్ గా మరియు షైనీ గా మెరిసిపోవాలని చాలా మంది ఆరాటపడుతుంటారు.అందుకోసమే తరచూ బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకుంటారు.
అలాగే మార్కెట్లో లభ్యం అయ్యే ఖరీదైన క్రీమ్ లను కొనుగోలు చేసి వాడుతుంటారు.కానీ నిజానికి పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చర్మాన్ని వైట్ గా మరియు సూపర్ షైనీగా మెరిపించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం( Homemade serum ) ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ సీరంను వాడితే మరిన్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు( raw milk ), రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు( Coconut milk ) వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose water ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని దాదాపు ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా మన సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ సీరంను అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
రెగ్యులర్ గా ఈ హోమ్ మేడ్ సీరం ను వాడటం వల్ల చర్మం కొద్ది రోజుల్లోనే తెల్లగా మారడం ప్రారంభమవుతుంది.
అలాగే స్కిన్ అద్దం మాదిరి సూపర్ షైనీ గా మెరుస్తుంది.అంతేకాదు ఈ సీరం ను వాడటం వల్ల చర్మంపై ముడతలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.స్కిన్ టైట్ గా మారుతుంది.
వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.వయసు పైబడిన యవ్వనంగా మెరుస్తారు.
మరియు గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.