స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు( hero Nandamuri Balakrishna ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.బాలయ్య తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు.
వరుసగా 4 విజయాలు బాలయ్య మార్కెట్ ను సైతం ఊహించని స్థాయిలో పెంచేశాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.బాలయ్య గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) కాంబోలో తెరకెక్కిన వీరసింహారెడ్డి మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ( Anirudh Music )అందించనున్నారని తెలుస్తోంది.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవరకు అనిరుధ్ మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని సాంగ్స్ హిట్ కావడంతో పాటు ఈ సినిమా బీజీఎంకు సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాలయ్య కొత్త మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అనే వార్త ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
అనిరుధ్ బాలయ్య మూవీకి బీజీఎంతో బాక్సాఫీస్ షేక్ చేయడం పక్కా అని చెప్పవచ్చు.మాస్ సినిమాలకు అనిరుధ్ బీజీఎం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం బాలయ్య సినిమాలకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ ( Thaman )గా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే.
అయితే గోపీచంద్ మలినేని మూవీకి మాత్రం అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.
బాలయ్య అనిరుధ్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.బాలయ్య తర్వాత సినిమాలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.బాలయ్య పారితోషికం కూడా 40 కోట్ల రూపాయల మార్కును చేరింది.
బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.