అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నిపుణులైన విదేశీ కార్మికులు ఉపాధి పొందేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు (h1b visa )సంబంధించి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ (Donald trump)ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.వచ్చి రాగానే అమెరికాలో పుట్టే విదేశీ పౌరుల పిల్లలకు జన్మత: సంక్రమించే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చారు ట్రంప్.ఈ నేపథ్యంలో హెచ్ 1 బీ వీసా చుట్టూ నెలకొన్న పలు వివాదాలపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని చర్చ నడుస్తోంది.
హెచ్ 1 బీ(H1B) వీసాలపై ట్రంప్‌కు అత్యంత సన్నిహితులైన కార్పోరేట్ శక్తులు ఎలాన్ మస్క్(Elon Musk_), భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి వంటి వారు చట్టబద్ధమైన వలసలకు మద్ధతు పలుకుతుంటే కొందరు రిపబ్లికన్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కొద్దిరోజుల ముందు నుంచే ఈ వివాదం పెద్ద దుమారం రేపింది.అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ హెచ్ 1 బీ వీసాపై (Trump on H1B visa)జరుగుతున్న చర్చపై స్పందించారు.
థఇరువర్గాలు చేస్తున్న వాదనలు తనకు నచ్చాయన్నారు.సమర్ధులు, నిపుణులైన వారు అమెరికాలో అడుగుపెట్టాలన్నదే తన ఆకాంక్ష అని ట్రంప్ స్పష్టం చేశారు.తాను కేవలం ఇంజనీర్ల గురించే మాట్లాడటం లేదని .అన్ని వర్గాలు నా దృష్టిలో ఉన్నారని డొనాల్డ్ ట్రంప్(Donald trump) తెలిపారు.దేశాన్ని నడిపించే సమర్ధులైన వ్యక్తులు హెచ్ 1 బీ వీసాతోనే వస్తారని అధ్యక్షుడు పేర్కొన్నారు.
నిన్నటి వరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన జో బైడెన్ ఎఫ్ 1 విద్యార్ధి వీసాలను సులభంగా హెచ్ 1 బీ వీసాగా మార్చుకునే అవకాశం కల్పించారు.ఇది అమెరికా కలలు కంటోన్న లక్షలాది మంది భారతీయులకు ఎంతో ప్రయోజనం కల్పించింది.భారత్ , చైనాలకు చెందినప ఎంతోమంది వృత్తి నిపుణులు దీని సాయంతో ప్రయోజనం పొందుతున్నారు.
ఇప్పుడు వలసలను నియంత్రించే లక్ష్యంతో ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంతో ఇలాంటి వారు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.