స్మోకింగ్ మానేయాలనుకునే వారికి శుభవార్త.. సరికొత్త ఔషధం..?

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు స్మోకింగ్( Smoking ) ఎక్కువగా చేస్తున్నారు.స్మోక్ చేయడం మానేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

 New Smoking Pill Helps To Giveup Smoking Habit Details, Tobacco Research And Tre-TeluguStop.com

కానీ వారు ఈ చెడు అలవాటును దూరం చేసుకోలేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు.ప్రపంచవ్యాప్తంగా స్మోకింగ్ చేయకూడదు అనీ ఎన్నో కఠినమైన చట్టాలను తెస్తున్న ఈ చెడు అలవాటును మాత్రం చాలా మంది ప్రజలు దూరం చేసుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం మారుతున్న ఆధునిక ప్రపంచంలో ఎన్నో సరికొత్త మార్పులు వస్తూ ఉన్నాయి.

అలాగే స్మోకింగ్ మానేయాలనుకునే వారికి కూడా శుభవార్త లాంటి విషయం తెలిసింది.తూర్పు ఆసియా వృక్షాల నుంచి తయారుచేసిన Cytisinicline ఔషధంతో సానుకూల ఫలితాలు వస్తున్నట్లు తాజా అధ్యాయం లో తెలిసింది.ఈ పిల్ తీసుకున్న వారిలో కేవలం రెండు నెలల్లోనే మూడోవంతు మంది పొగ తాగడం మానేశారని నిపుణులు చెబుతున్నారు.

మసాచుసెట్స్‌ జనరల్ హాస్పిటల్ కు చెందిన టొబాకో రీసెర్చ్ అండ్ ట్రీట్‌మెంట్‌ సెంటర్( Tobacco Research and Treatment Center ) 810 మంది స్మోకింగ్ అలవాటు ఉన్న వారిపై ఈ అధ్యయనం చేసింది.

ఇంకా చెప్పాలంటే కొంత మందికి ఆరు వారాల పాటు, మరి కొంత మందికి 12 వారాల పాటు ఈ పిల్ ను రోజు అందించారు.అలాగే ఆరు వారల పాటు తీసుకున్నవారు స్మోకింగ్ ను పూర్తిగా మానేశారు.12 వారాల పాటు తీసుకున్న వారిలో మూడో వంతు మంది స్మోక్ చేయడం మానేశారు.ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం దేశంలో 26 కోట్ల మందికి పైగా పొగాకు ఉత్పత్తులు( Tobacco Products ) ఉపయోగిస్తున్నట్లు చాలా రకాల సర్వేలలో తెలిసింది.పొగాకు కారణంగా ప్రతి సంవత్సరం 12 లక్షల మంది మృతి చెందుతున్నట్లు కూడా వెల్లడించారు.

దేశంలో 27% క్యాన్సర్( cancer ) కేసులకు పొగాకే కారణమని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube