గర్భంలోని శిశువుకు మలేరియా సోకుతుందా.. పసిపిల్లల లో ఈ వ్యాధి లక్షణాలు ఇలా గుర్తించాలి..!

సాధారణంగా చెప్పాలంటే మలేరియా( Malaria ) అనేది దోమల వల్ల వచ్చే వ్యాధి అని చాలామందికి తెలుసు.

ఈ వ్యాధి లక్షణాలు జ్వరం, చలి, చెమట, తీవ్రంగా ఉంటుంది.

చిన్నారులలో మలేరియా తీవ్రమైన అనారోగ్యం కావచ్చు.ఎందుకంటే పిల్లల రోగనిరోధక శక్తి( Immunity Power ) చాలా బలహీనంగా ఉంటుంది.

కాబట్టి వారు సులభంగా వ్యాధుల బారిన పడతారు.పిల్లలలో మలేరియా లక్షణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ప్లాస్మోడియం పరాన్నజీవి వల్ల మలేరియా వ్యాధి వ్యాపిస్తుంది.భారతదేశంలో ప్లాస్మోడియం వైవాక్స్ , ప్లాస్మోడియం ఫాల్సిపరమ్ అనే రెండు జాతుల వల్ల మలేరియా వస్తుంది.

Advertisement

మలేరియా సోకిన అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది.గర్భధారణ ( Pregnancy ) సమయంలో మలేరియా ఉంటే అది పిండానికి కూడా చేరుతుంది.

దీనిని పుట్టుకతో వచ్చే మలేరియా అంటారు.పుట్టిన తర్వాత మొదటి మూడు నెలల్లో శిశువులో మలేరియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే మలేరియా వచ్చినప్పుడు పిల్లవాడికి నిరసం, చిరాకు, విశ్రాంతి లేకపోవడం, అలసట ఉంటుంది.వికారం, విరోచనాలు కూడా సంభవించవచ్చు.

అంతేకాకుండా చలి లేదా అధిక జ్వరంతో వణుకు, వాంతులు అలాగే ఆకలి లేకపోవడం వంటివి మలేరియా లక్షణాలు.మలేరియా సోకినప్పుడు చాలామంది పిల్లలు కడుపునొప్పి వికారం గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు.పిల్లవాడు నిరంతరం నీరసంగా లేదా చిరాకుగా ఉంటే అది తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

కొంతమంది పిల్లలలో మలేరియా లక్షణాలు భిన్నంగా ఉంటాయి.కొంతమంది పిల్లలు నిద్రలేమి, అలసట, బలహీనంగా కూడా ఉండవచ్చు.

Advertisement

ఈ వ్యాధిని నివారించడానికి కొన్ని చర్యలు కచ్చితంగా తీసుకోవాలి.ఈ వ్యాధి దోమల వల్ల వస్తుంది కాబట్టి పిల్లలను దోమల నుంచి దూరంగా ఉంచాలి.వర్షాకాలంలో ఇంటి చుట్టు ప్రక్కల నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి.

కూలర్లను శుభ్రంగా ఉంచుకోవాలి.నిద్రపోయేటప్పుడు దోమల నివారణ మందులు వాడడం మంచిది.

అలాగే దోమతెరలు ఉపయోగించాలి.ఇంకా చెప్పాలంటే మలేరియా బలహీనత, అధిక అలసటను కలిగిస్తుంది.

కాబట్టి ఈ సమయంలో పిల్లలకు ఎక్కువగా విశ్రాంతి ఇవ్వాలి.ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లడం ఎంతో మంచిది.

తాజా వార్తలు