తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నడిబొడ్డున హైకోర్టు గేట్ నెంబర్ 6 వద్ద పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.
హత్యకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.తాజాగా గురువారం (మే 4) న చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైకోర్టు గేట్ నెంబర్ 6 వద్ద ఇద్దరు వ్యక్తులు రూ.10 వేల కోసం గొడవపడ్డారు.ఇద్దరి మధ్య గొడవ పెరుగుతూ ఉంటే.
చుట్టుపక్కల ఉండేవారు మాత్రం గొడవను ఆపకుండా తమాషా చూస్తున్నారు.ఇద్దరి మధ్య గొడవ ముదిరి కొట్టుకునే స్థాయికి చేరడంతో క్షణికావేశాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయిన ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే కత్తితో దారుణంగా అవతల వ్యక్తిని పొడిచాడు.
దీంతో రక్తపు మడుగులోకి జారి ఆ వ్యక్తి మృతి చెందడంతో చూస్తున్న వారందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ హత్య సంఘటన పోలీసులకు తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకొని మృతుదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి( Gandhi Hospital ) తరలించారు.మృతుడిని సులబ్ కాంప్లెక్స్ లో పనిచేసే మిథున్ గా పోలీసులు గుర్తించారు.హత్య చేసిన వ్యక్తి ఎక్కడికి పారిపోకుండా పోలీసులకు స్వయంగా లొంగిపోయాడు.పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.హైదరాబాద్ నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ తీవ్ర కలకలం రేపుతున్నాయి.అయితే నగరం నడిబొడ్డున జన ప్రవాహం ఉన్న ప్రాంతంలో పట్టపగలు అందరు చూస్తుండగా జరిగిన ఈ హత్య గురించి నగర ప్రజలు భయభ్రాంతులకు గురై ఆందోళన చెందుతున్నారు.
సమాజంలో ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వెయ్యకపోతే మరిన్ని దారుణమైన హత్యలు జరిగే అవకాశాలు ఉన్నాయి.ఇలాంటి దారుణాలపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప నగరంలోని ప్రజలు ప్రశాంతంగా నిద్ర పోలేరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.