Mohan Lal : మోహన్ లాల్ పుణ్యమా అని టాలీవుడ్ హీరోలు అందుకున్న హిట్స్ ఇవే..!

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోలు ఎవరు అని అడిగితే మనకు ముందుగా మోహన్ లాల్ (Mohan Lal) పేరే గుర్తుకొస్తుంది.ఈ హీరో అద్భుతమైన నటనతో భారతదేశ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను అలరించాడు.

 Telugu Heros Block Busters From Mohan Lal Movies-TeluguStop.com

జూ.ఎన్టీఆర్(Jr.

Ntr) హీరోగా వచ్చిన “జనతా గ్యారేజ్”(Janata Garage) సినిమాలో మోహన్ లాల్ ఓ కీలకపాత్ర పోషించాడు.ఈ ఒక్క పాత్రతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

ఈ స్టార్ హీరో 1978లో సినిమా ఇండస్ట్రీలో యాక్టర్‌గా అడుగుపెట్టాడు.అప్పటి నుంచి అంటే నాలుగు దశాబ్దాలకు పైగా మించిన కెరీర్‌లో 400కి పైగా చిత్రాలు చేశాడు.

అన్ని సినిమాలు హీరోగా చేయడం అంటే అంత సులభమైన కాదు.అందుకే ఈ టాలెంటెడ్ హీరో పేరు మీద ఎవరూ చెరిపేయలేని కొన్ని రికార్డులు కూడా క్రియేట్ అయ్యాయి.

మోహన్‌లాల్‌ హీరోగా చేసిన చాలా మలయాళ సినిమాలు తెలుగులో రీమేక్స్‌గా వచ్చి హిట్స్ కూడా అయ్యాయి.టాలీవుడ్ అగ్ర హీరోల్లో చాలామంది మోహన్‌ లాల్ మూవీలనే తెలుగులో తీసి సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు.

Telugu Balakrishna, Drishyam, Janata Garage, Jr Ntr, Raghavendra Rao, Krishna Va

ఉదాహరణకు వెంకటేష్‌(Venkatesh) ని తీసుకోవచ్చు.ఈ టాలెంటెడ్ హీరో మలయాళంలో మోహన్‌లాల్‌ మెయిన్ లీడ్ చేసిన దృశ్యం, దృశ్యం-2(Drishyam , Drishyam 2 ) సినిమాలను తెలుగులో తీసి హిట్స్ అందుకున్నాడు.దీనికంటే చాలా మందు అంటే 1990 కాలంలో బాలకృష్ణ మోహన్ లాల్ (Balakrishna Mohanlal ) హీరోగా వచ్చిన ‘ఆర్యన్‌ (1998)’ సినిమాని తెలుగులో రీమేక్ చేశాడు.ఆ సినిమా పేరు అశోక్ చక్రవర్తి (1989).

ఆర్యన్ మలయాళంలో హిట్ అయిందని దీనిని బాలకృష్ణ తెలుగులో రీమేక్ చేశాడు.తెలుగు సినిమాని ఎస్‌.

ఎస్‌.రవిచంద్ర డైరెక్ట్ చేశాడు.

Telugu Balakrishna, Drishyam, Janata Garage, Jr Ntr, Raghavendra Rao, Krishna Va

ఇక మోహన్‌ బాబు(Mohan Babu) కెరీర్‌ను నిలబెట్టిన ‘అల్లుడుగారు (1990)’ సినిమా కూడా మోహన్‌లాల్ చేసిన మూవీ ఆధారంగా రావడం విశేషం.1988లో వచ్చిన మలయాళం మూవీ ‘చిత్రమ్‌’కి తెలుగు రీమేక్‌గా అల్లుడుగారు రూపొందింది.ఈ సినిమాని కె.రాఘవేంద్రరావు(K.Raghavendra Rao) తీశాడు.ఒరిజినల్ మూవీలో మోహన్‌లాల్‌ హీరోగా చేయగా ప్రియదర్శన్‌ డైరెక్ట్ చేశాడు.

Telugu Balakrishna, Drishyam, Janata Garage, Jr Ntr, Raghavendra Rao, Krishna Va

మోహన్‌లాల్‌ మలయాళం హిట్స్‌ను తెలుగులో ఎక్కువగా రీమేక్ చేసిన వారిలో నాగార్జున(Nagarjuna) ఒకడని చెప్పుకోవచ్చు.నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన “నిర్ణయం” సినిమా మోహన్ లాల్ మూవీ ఆధారంగానే వచ్చింది.మలయాళం మూవీ “వందనం”కి రీమేక్‌గా నిర్ణయం మూవీ తీశారు.అలానే మోహన్‌లాల్ చేసిన ‘స్పటికం’ చిత్రాన్ని తెలుగులో ‘వజ్రం’గా రీమేక్‌ చేశాడు నాగార్జున.దీనిని ఎస్‌.వి.కృష్ణారెడ్డి (SV Krishna Reddy)డైరెక్ట్ చేశాడు.’చంద్రలేఖ’ మూవీ కూడా మోహన్‌లాల్ చేసిన ఓ సినిమాకి రీమేక్‌గా రూపొందింది.మలయాళంలో కూడా సేమ్ అదే పేరుతో ఈ మూవీ రిలీజ్ అయింది.తెలుగులో ఈ సినిమాకి కృష్ణవంశీ(Krishna Vamsi) దర్శకత్వం వహించారు.నాగార్జున, మోహన్‌బాబు కలిసి చేసిన ‘అధిపతి’ మూవీ మోహన్‌లాల్‌ మలయాళం మూవీ ‘నరసింహం’ ఆధారంగా వచ్చింది.చిరంజీవి, మోహన్‌రాజా కాంబోలో తెరకెక్కిన ‘గాడ్‌ ఫాదర్‌’ మోహన్‌లాల్‌ యాక్ట్ చేసిన ‘లూసిఫర్‌’ ఆధారంగా వచ్చింది.

ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ కూడా మోహన్ లాల్ చేసిన సినిమాలు రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.అందులో ఒకటి ‘ముత్తు’ మూవీ.

ఇది మోహన్ లాల్ చేసిన ‘తెన్మవిన్‌ కొంబత్‌’కి రీమేక్‌గా వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube