ఆదివారం రోజు తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.ప్రస్తుతం ఉన్న కాంపిటేషన్ లో ఓ కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదని.
ఒక పార్టీ ని నడిపించాలంటే ఎంతో ఒత్తిడిని తట్టుకుని నిరంతరాయంగా కృషిచేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.విజయశాంతి, దేవేంద్ర గౌడ్ వంటి నేతలు ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయని ఆయన గుర్తుకు తెచ్చారు.
అయితే కేసీఆర్ కామెంట్స్ చేసిన కొద్ది గంటల సమయంలోనే వైఎస్ షర్మిల హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌లో ఆత్మీయ సమ్మేళనం నికి పిలుపునిచ్చారు.
వాస్తవానికి గత కొద్ది నెలల నుంచి షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ఓ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఆ ప్రచారాలకు బలానిస్తూ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నికి పిలుపునిచ్చారు.షర్మిలమ్మ పిలుపుమేరకు వైఎస్సార్ అభిమానులంతా లోటస్‌పాండ్ కి పెద్ద ఎత్తున తరలి వచ్చారు.మరి ఈ సమ్మేళనం తర్వాత షర్మిల తన సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తారా? లేక వైయస్సార్ 50వ పెళ్లిరోజు సందర్భంగా కేవలం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి అంతటితో ఆగిపోతారా అనేది తెలియాల్సి ఉంది.
అయితే గత కొంత కాలంగా కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ కి సీఎం పదవి కట్టబెడతారని జోరుగా ప్రచారం జరిగింది కానీ ఆ ప్రచారంలో ఎటువంటి సత్యం లేదని తేలింది.
అలాగే ఇప్పుడు షర్మిల పార్టీ పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది కానీ ఇందులో నిజమెంతో అబద్ధమెంతో కాలమే సమాధానం చెబుతుంది.
అయితే ఇంకా అధికారికంగా షర్మిల కొత్తపార్టీ పై ఎటువంటి క్లారిటీ రాలేదు కానీ అప్పుడే రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.బీజేపీ పార్టీ పెద్దలు జగన్ తో చాలా రోజులు చర్చించి కేసీఆర్ ని సీఎం కుర్చీ నుంచి దించాలనే షర్మిల చేత ఓ పార్టీ ఏర్పాటు చేసేలా చేస్తున్నారని ప్రముఖ పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గ ప్రజలందరూ కూడా కేసీఆర్ కే ఓట్లు వేస్తున్నారు.
కానీ షర్మిల తెలంగాణలో ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే ఆ ఓట్లన్నీ కూడా చీలిపోతాయి.ఫలితంగా కేసీఆర్ చాలా ఓట్లు కోల్పోతారు.తద్వారా బీజేపీ పార్టీ తెరాస పై పైచేయి సాధించవచ్చు.క్రైస్తవులు కూడా షర్మిల పార్టీకి ఓట్లు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దీనివల్ల కూడా ఓట్లు భారీగా చీలిపోయే అవకాశాలు ఉంటాయి.ఎటొచ్చి తెరాస పార్టీ ని బలహీన పరచాలనే బీజేపీ పెద్దలు జగన్ చేత పావులు కదుపుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇది ఇలా ఉండగా కేసీఆర్ ప్రమేయంతోనే వైయస్ షర్మిల కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని మరి కొంతమంది చెబుతున్నారు.బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితులలోనూ తెలంగాణాలో అధికారంలోకి రాకూడదని కేసీఆర్ భావిస్తున్నారని.అందుకే జగన్ తో చర్చించి షర్మిల తో ఓ పార్టీ పెట్టించి తెలంగాణ ఓటర్లను బీజేపీ నుంచి డైవర్ట్ చేయాలని రాజకీయ వ్యూహాలు అమలు పరుస్తున్నారు అని వాదనలు వినిపిస్తున్నారు.ప్రస్తుత పరిణామాలలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ తెరమీదకు వస్తే రాజకీయాలు మరింత క్లిష్టతరం గా మారుతాయని కేసీఆర్ భావిస్తున్నారని.
ఆయనకు షర్మిల కొత్త పార్టీ ఆలోచన కి ఎటువంటి సంబంధం లేదని మరి కొంతమంది అంటున్నారు.అలాగే కేసీఆర్ కి మద్దతుగా, బిజెపికి వ్యతిరేకంగా జగన్ తన సొంత చెల్లెలు చేత ఎటువంటి పార్టీని ఏర్పాటు చేయారని.
బీజేపీ అండను ఆయన ఎటువంటి పరిస్థితులలోనూ పోగొట్టుకోవాలని మరి కొంతమంది చెబుతున్నారు .అలాగే జగన్ ఆజ్ఞ లేనిదే షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేసేంత ధైర్యం చేయారనే వాదన బలంగా వినిపిస్తోంది.మరి జగన్ తో ఏ పార్టీ నేతలు పొలిటికల్ గేమ్ ఆడిస్తున్నారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.