తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) కు ఇప్పుడు తలనొప్పి మొదలైంది.ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరిని అభ్యర్థులుగా పోటీకి దించాలనే విషయంలో తర్జన భర్జన పడుతోంది.
ఈ ఎమ్మెల్సీ స్థానాలను పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఆశిస్తూ ఉండడం, అలాగే కొంతమందికి ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా, ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో, వారంతా ఇప్పుడు తమకే అవకాశం దక్కుతుందనే అంచనాలో ఉన్నారు.దాదాపు 15 మంది వరకు కీలక నేతలు ఎమ్మెల్సీ పదవులు కోసం పోటీ పడుతున్నారు.
అయితే ఈ ఖాళీలను ఏ విధంగా భర్తీ చేస్తారనేది తేలాల్సి ఉంది.మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్లు త్యాగం చేసిన వారు, అలాగే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన సీనియర్ నేతలు వీరిలో ఎవరికి కేటాయిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ కాగా, ఇప్పుడు ఆ రెండింటికి తీవ్ర పోటీ నెలకొంది.అయితే ఈ రెండిటిలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ కు ఒక ఎమ్మెల్సీ దక్కుతుంది.మిగిలిన దాంట్లో పోటీ లో ఉంటారా లేదా అనేది తేలాల్సి ఉంది.ఎవరికి వారు తమకి ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందనే ఆశలు పెట్టుకున్నారు. ఈనెల 14న సీఎం రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పెట్టుబడుల సమీకరణ నిమిత్తం దావోస్ కు వెళ్ళనున్నారు.ఆ లోపే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించి, దానికి సంబంధించిన బాధ్యతలను పార్టీ కీలక నేతలకు అప్పగించే ఆలోచనలో రేవంత్ ఉన్నారు.
కాకపోతే ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించాలనే విషయంలో రేవంత్ సైతం తద్దిన బజ్జనం పడుతున్నారు.ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ను ఆశిస్తున్న నేతల పేర్లను ఒకసారి పరిశీలిస్తే.అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మహేష్ కుమార్ గౌడ్, హర్కర వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్, వేం నరేందర్ రెడ్డి, బండ్ల గణేష్, తీన్మార్ మల్లన్న, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, అందే శ్రీ, మాజీ ఎంపీ బలరాం నాయక్ ,మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ,మాజీ ఎమ్మెల్యే పోదాం వీరయ్య ,మాజీమంత్రి షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, సంపత్ కుమార్, అంజన్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి పుష్పలీల, మైనంపల్లి హనుమంతరావు వంటి వారు ఈ పోటీలో ఉన్నారు.