ఆ ఇష్యూలో సైలెంట్ గా ఉండ‌టం.. వైసీపీకి తిప్ప‌లు త‌ప్ప‌వా..?

ఏపీలో వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అంశాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది.క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్నిన విష‌యాల్లో కూడా సైలెంట్ గా ఉండ‌టం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

 Being Silent On That Issue Is It Wrong For Ycp To Turn Around , Cm Jagan , Mp G-TeluguStop.com

రాజ‌కీయాల్లో మొండిత‌నం.త‌న‌ను న‌మ్ముకున్న‌వారికి ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా అండ‌గా ఉండ‌టం మంచిదే.

కానీ కొన్ని విష‌యాల‌ను సీరియ‌స్ గా తీసుకోకుండే దాని వ‌ల్ల క‌లిగే న‌ష్టాన్ని కూడా భ‌రించాల్సి ఉంటుంది.కానీ అవేమీ పట్టించుకోకుండా తన మానాన తాను ఉండిపోతున్న తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు.

ఇటీవల హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిందని చెబుతున్న వీడియో వైరల్ కావటం.అందులో ఉన్నది తానే అయినా.అందులో ఉన్నట్లుగా చేస్తున్నది తాను కాదని.అదంతా కూడా ఒక పెద్ద కుట్రగా అభివర్ణించటం.

ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చేయటం తెలిసిందే.దీంతో దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది.

అయితే సదరు వీడియో మార్ఫింగ్ జరిగిందన్నట్లుగా వాదనలు వినిపిస్తున్నారు.ఈ వాదనకు బలం చేకూరేలా ఈ మధ్యనే జిల్లా ఎస్పీ .సదరు వీడియోలో ఉన్న అంశాల్ని పట్టించుకోవాలని తేల్చేశారు.ఇదే అదునుగా ఎంపీ గోరంట్ల సైతం ప్రెస్ మీట్ పెట్టి తాను అనుమానిస్తున్న వారిని నోటి మాటలతో చెప్పలేని విధంగా తిట్టేశారు.

Telugu Cm Jagan, Delhi, Mpjasbir, Vedio, Primenarendra-Political

ఢిల్లీకి చేరిన మాధ‌వ్ ఇష్యూ.

అయితే ఇప్పటికైనా ఈ లొల్లిని ముగించాలంటూ తనకు తానే చెప్పేకున్న ఆయనకు అనుకోని ఎదురుదెబ్బ తగిలే వీలుందంటున్నారు.ఆయనతో ఆగకుండా.ఆయన మీద చర్యల విషయంలో పెద్దగా ఆసక్తి చూపని వైసీపీ అధినేతకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్న మాట వినిపిస్తోంది.ఈ వీడియో అంశం ఇప్పుడు ఢిల్లీకి చేరింది.తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ లేఖ రాశారు.అంతేకాదు స్పీకర్ కు.జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు లేఖ రాశారు.మాధవ్ వీడియో వ్యవహారం పార్లమెంటు వ్యవస్థను దెబ్బ తీసేలా ఉందన్న వాదన వినిపించారు.

Telugu Cm Jagan, Delhi, Mpjasbir, Vedio, Primenarendra-Political

ఈ వీడియో గురించి ఒక్కొక్కొరు ఒక్కోలా మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్న ఆయన మాటలు మ‌రో కొత్త‌మ‌లుపు తిరిగేలా ఉన్నాయ‌ని అంటున్నారు.అయితే ఈ వీడియో అంశంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.దీనికి కారణం ఏపీ తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు అనిత లేఖ రాయటమే.

తక్షణమే తమ ఫిర్యాదును పరిశీలించి.వీడియో అంశాన్ని స్వతంత్య్రంగా దర్యాప్తు చేయించి.

కమిషన్ కు నివేదిక ఇవ్వాలంటూ రాసిన లేఖతో ఇష్యూ మరింత పెద్ద‌దైంద‌ని చెబుతున్నారు.ఢిల్లీకి చేరిన ఈ మ్యాట‌ర్ ఇంత‌టితో ముగిసిపోలేద‌ని.

దాని ప‌ర్యావ‌సానం.ఏపీ సీఎం జగన్ కు ఇబ్బందులు తప్ప‌వ‌నే మాట వినిపిస్తోంది.

వాస్త‌వానికి మొద‌ట్లోనే పార్టీ ఈ ఇష్యూపై స్పందించి చ‌ర్య‌లు తీసుకుంటే ఇంత‌వ‌ర‌కు వ‌చ్చేది కాద‌ని.పెన్ను పేప‌ప‌ర్ వ‌ర‌కు వచ్చేది కాద‌ని అంటున్నారు.

ఇక గోరంట్ల వీడియో ఎపిసోడ్ తో జ‌గ‌న్ కు తిప్ప‌లు త‌ప్ప‌వ‌నే అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube