తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.ఇక మొన్నటి వరకు పెద్ద ఎత్తున కేసీఆర్ టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు విమర్శల వైఖరిని పూర్తిగా మార్చుకున్నాయి.
అయితే ప్రస్తుతం ఇదివరకటి ప్రెస్ మీట్ తోనే సంచలనం సృష్టించిన కేసీఆర్ తాజా ప్రెస్ మీట్ తో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసీఆర్ ఇక రానున్న రోజుల్లో దేశ రాజకీయాలపైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్న పరిస్థితి కనిపిస్తోంది.ఇప్పటికే మమతాబెనర్జీ లాంటి నేతలు కెసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఇంకా చాలా దూకుడుగా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఇప్పుడు కెసీఆర్ దేశ వ్యాప్తంగా బీజేపీ టార్గెట్ తో ప్రతిపక్షాలను రాష్ట్ర అంశాలపై మాట్లాడనీయకుండా దేశ వ్యాప్తంగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారు కాబట్టి దానినే పూర్తిగా తప్పక ఖండించాల్సిన పరిస్థితి ఉంది.
దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ పరిపాలనా లోపాలను అంతేకాక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, త్వరలో బీజేపీ అవినీతి చిట్టాను బయటపెడతానని చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి.
అంతేకాక ఇప్పటికే నాకు బీజేపీ అవినీతికి సంబంధించిన ఆధారాలు పంపిస్తున్నారని త్వరలో వాటన్నింటినీ బయటపెడతానని కెసీఆర్ వ్యాఖ్యానించారు.దీంతో ప్రతిపక్షాలను టీఆర్ఎస్ పై టార్గెట్ చేయడం కోసం కాకుండా తమ పార్టీలపై కెసీఆర్ చేస్తున్న ఆరోపణలను ఖండించుకునేలా మాత్రమే దృష్టి సారించేలా చేయడంలో కెసీఆర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
అయితే ఇక రానున్న రోజుల్లో చాలా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీపై విరుచుకపడే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయం ఆసక్తిగా మారే అవకాశం ఉంది.