ఒక సినిమా 50 రోజులు ఆడింది అంటే దానిని హిట్ అని, వంద రోజులు ఆడితే సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్‌బస్టర్ హిట్ అని అంటారు.అలాంటిది ఒక సినిమా ఏకంగా ఏడాది ఆడితే? అసలు ఏదైనా ఒక సినిమా ఏడాది పాటు ఆడుతుందా అనే అనుమానం కూడా వస్తుంది.కానీ అలా ఏడాది పాటు ఆడిన సినిమా ఒకటి ఉంది.ఆ సినిమా మరేదో కాదు రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమా.( Chandramukhi ) ఈ సినిమా తమిళ్ లో ఏకంగా సంవత్సరం ఆడింది.
ఇందులో హీరోయిన్ జ్యోతిక ముఖ్య పాత్రలో నటించారు.
చందముఖి సినిమా లో జ్యోతిక నటన చూసిన తర్వాత చాలా సంవత్సరాల పాటు ఆమె చంద్రముఖి గానే ప్రేక్షకులకి గుర్తున్నారు.చంద్రముఖి సినిమా మలయాళ సినిమా అయిన ‘మణిచిత్రతాళు’( Manichithrathalu ) కు రీమేక్.
అయితే చంద్రముఖి పాత్రలో చాలా మంది హీరోయిన్లు నటించారు.వారు ఎవరో, వారు నటించిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శోభన:
ఒరిజినల్ సినిమా అయిన ‘మణిచిత్రతాళు’ సినిమాలో శోభన( Shobana ) ‘నాగవల్లి’ పాత్రలో నటించారు.మలయాళంలో తెరకేక్కిన ఈ సినిమాలో నాగవల్లి పాత్ర తమిళ్ మాట్లాడుతుంది.ఈ సినిమాలో నాగవల్లి గా( Nagavalli ) నటించిన శోభన ఎన్నో అవార్డులు, అభినందనలు అందుకున్నారు.

సౌందర్య:
కన్నడ భాషలో లో తెరకేక్కిన ‘ఆప్తమిత్ర’ సినిమాలో సౌందర్య( Soundarya ) ‘గంగ’ పాత్రలో నటించారు.కన్నడలో కూడా ఈ పాత్ర పేరు నాగవల్లి అని పెట్టారు.ఇందులో నాగవల్లి పాత్ర తెలుగు మాట్లాడుతుంది.

జ్యోతిక:
తమిళ్ లో ‘చంద్రముఖి’ పేరు తెరకెక్కిన ఈ సినిమాలో గంగ పాత్రలో జ్యోతిక( Jyotika ) నటించారు.తెలుగులో కూడా డబ్ చేసి అదే పేరుతో విడుదల చేశారు.తమిళ్ లో చంద్రముఖి పాత్ర తెలుగు మాట్లాడుతుంది .తెలుగులో చంద్రముఖి పాత్ర తమిళ్ లో మాట్లాడుతుంది.

విద్యాబాలన్:
హిందీలో ‘భూల్ భులయ్యా’ పేరుతో రూపొందిన ఈ సినిమాలో విద్యా బాలన్( Vidya Balan ) చంద్రముఖి పాత్రలో నటించారు.అయితే ఈ సినిమాలో చంద్రముఖి పేరుని మంజులిక అని మార్చారు.ఇందులో మంజులిక పాత్ర బెంగాలీ మాట్లాడుతుంది.

అను చౌదరి:
బెంగాలీలో ఇదే సినిమాని ‘రాజ్ మొహుల్’ పేరుతో రూపొందించారు.ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో అను చౌదరి( Anu Chowdary ) నటించారు.

విమల రామన్:
ఆప్తమిత్ర సినిమా కి సీక్వెల్ గా రూపొందిన ‘ఆప్త రక్షక’ సినిమా లో లో నాగవల్లి పాత్రలో విమల రామన్( Vimala Raman ) నటించారు.

అనుష్క:
చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా తెలుగులో రూపొందిన ‘నాగవల్లి’ సినిమాలో ఇదే పాత్రలో అనుష్క( Anushka ) నటించారు.అయితే ఈ సినిమాలో చంద్రముఖి అసలు పేరు చంద్రముఖి కాదని నాగవల్లి అని చెప్తారు.

టబు:
హిందీలో భూల్ భులయ్యా సినిమాకి సీక్వెల్ గా భూల్ భులయ్యా – 2 రూపొందించారు.ఈ సినిమా స్టోరీ చాలా వరకు మార్చారు.అయితే మొదటి భాగంలో మంజులిక అనే పాత్ర మీద కథ నడుస్తుంది.2వ భాగం లో కూడా మంజులిక అనే ఒక పాత్ర ఉంటుంది.ఆ పాత్రలో టబు( Tabu ) నటించారు.

కంగనా రనౌత్:
చంద్రముఖి సినిమా తీసిన చాలా సంవత్సరాల తరువాత దానికి అసలైన సీక్వెల్ గా రూపొందుతున్న చంద్రముఖి 2 సినిమాలో కంగనా రనౌత్( Kangana Ranaut ) ‘చందముఖి’ గా నటిస్తున్నారు.ఈ సినిమా మొదటి భాగానికి కొనసాగింపుగానే ఉంటుంది అని చెప్పారు.అంతే కాకుండా మొదటి భాగంలో నటించిన వడివేలు కూడా ఇందులో ఉన్నారు.
ఇక రజనీకాంత్ పాత్రలో లారెన్స్ నటిస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది.







