ప్రస్తుత సీజన్ లో విరివిరిగా లభ్యమయ్యే ఆకుకూరల్లో చింత చిగురు( Tamarind Leaves ) ఒకటి.పులుపు వగరు కలబోసుకుని అద్భుతమైన రుచిని కలిగి ఉండే చింత చిగురును వెజ్, నాన్ వెజ్ అనే తేడా లేకుండా వివిధ రకాల కూరల్లో వేసి వండుతుంటారు.
చింతచిగురు చికెన్, చింతచిగురు మటన్, చింత చిగురు రొయ్యలు, చింతచిగురు పప్పు వంటివి చాలా ఫేమస్ అయిన వంటకాలు.రుచి పరంగానే కాదు చింత చిగురు ఆరోగ్యపరంగా కూడా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.
వారానికి ఒక్కసారి చింత చిగురు తింటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదని నిపుణులు చెబుతున్నారు.
చింత చిగురులో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్ సి, ప్రోటీన్లు, ఫైబర్ తో సహా అనేక పోషకాలు నిండుగా ఉంటాయి.
వెయిట్ లాస్( Weight Loss ) అవ్వాలనుకునే వారికి చింత చిగురు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.చింత చిగురులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.అందువల్ల చింత చిగురు మీ కడుపును ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతుంది.అతి ఆకలిని దూరం చేస్తుంది.
దీంతో తినడం తగ్గిస్తారు.ఫలితంగా బరువూ తగ్గుతారు.

అలాగే చింత చిగురులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ లకు వ్యతిరేకంగా పోరాడి రోగనిరోధక శక్తిని( Immunity Power ) పెంచడంలో అద్భుతంగా తోడ్పడతాయి.చింత చిగురు చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఆడవారు నెలసరి సమయంలో చింత చిగురుతో జ్యూస్ తయారు చేసుకుని తీసుకుంటే ఎటువంటి నొప్పులైనా పరార్ అవుతాయి.

రక్తహీనతతో బాధపడేవారికి చింత చిగురు ఎంతో మేలు చేస్తుంది.చింత చిగురు ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.రక్తహీనతను తరిమి కొడుతుంది.చింత చిగురులో పొటాషియం మెండుగా ఉంటుంది.చింత చిగురును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.అంతేకాదు చింత చిగురు థైరాయిడ్ ను( Thyroid ) కంట్రోల్ లో ఉంచుతుంది.
జుట్టు రాలడాన్ని అరికడుతుంది.మరియు చర్మాన్ని యవ్వనంగా సైతం మెరిపిస్తుంది.