మొటిమలు.( Pimples ) పని కట్టుకుని మరీ వచ్చి మనశ్శాంతిని దూరం చేస్తాయి.అందాన్ని పాడు చేస్తాయి.మనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి.అందుకే మొటిమలు అంటేనే చాలా మంది భయపడుతుంటారు.పైగా కొందరిలో మొటిమలు ఒక్కసారి వచ్చాయంటే అంత త్వరగా తగ్గవు.
ఇలాంటి వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు.మీరు కూడా మొటిమలతో మదన పడుతున్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను తరచూ పాటిస్తే శాశ్వతంగా మొటిమలకు బై బై చెప్పవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బంగాళదుంప( Potato )ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బంగాళదుంప ఫ్యూరీ వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి( Fenugreek Powder ), వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి కనుక ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి మొండి మొటిమలు అయినా సరే దెబ్బకు పరార్ అవుతాయి.
అలాగే మళ్లీ మళ్లీ వేధించకుండా సైతం ఉంటాయి.

తరచూ ఈ రెమెడీని పాటించడం వల్ల మొటిమలు దూరంగా ఉండవచ్చు.అలాగే చర్మంపై మచ్చలు( Dark Spots ) ఏమైనా ఉంటే క్రమంగా మాయం అవుతాయి.చర్మం నిగారింపుగా, కాంతివంతంగా మెరుస్తుంది.
కాబట్టి మొటిమలకు దూరంగా ఉండాలని భావించేవారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను పాటించండి.







