పెదాలు డ్రై గా మారి అసహ్యంగా కనిపిస్తున్నాయా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

ప్రస్తుత చలికాలంలో దాదాపు అందరి పెదాలు డ్రై గా( Lips dry ) మారిపోతుంటాయి.పగుళ్లు ఏర్పడుతుంటాయి.

 Natural Cream For Dry And Chapped Lips , Dry Lips, Chapped Lips, Lip Cream-TeluguStop.com

దీంతో అందంగా మెరిసిపోతూ ఉండాల్సిన పెదాలు చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.అటువంటి పెదాలను ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక తెగ హైరానా పడిపోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు కచ్చితంగా సహాయపడుతుంది.ఈ రెమెడీతో డ్రైగా మారిన పెదాలను, పెదాల పగుళ్లను సులభంగా మరియు వేగంగా నివారించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్ ( Sugar powder )వేసుకోవాలి.అలాగే మూడు స్పూన్లు హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ తేనె, మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, ( aloe vera gel )నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా ఒక మంచి క్రీమ్ సిద్ధమవుతుంది.

ఈ క్రీమ్ ను బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.నైట్‌ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను పెదాలకు అప్లై చేసి సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే వాటర్ తో శుభ్రంగా పెదాలను క్లీన్ చేసుకోవాలి.అలాగే ఉదయం స్నానం చేయడానికి గంట ముందు కూడా ఈ క్రీమ్ ను అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.

ఈ హోమ్ మేడ్ లిప్ క్రీమ్ డ్రైగా, అసహ్యంగా మారిన మీ పెదాలను తేమగా కోమలంగా మారుస్తుంది.పెదాల పగుళ్లను నివారిస్తుంది.అలాగే ఈ లిప్ క్రీమ్( Lip cream ) ను రోజు వాడడం వల్ల పెదాల నలుపు వదిలిపోతుంది.లిప్స్ మంచి కలర్ వస్తాయి.

అందంగా మెరుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube