నెలసరి అంటేనే అమ్మాయిలు తెగ హైరానా పడిపోతుంటారు.నెలసరి సమయం దగ్గర పడుతుంటే ఏదో తెలియని ఆందోళన ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది.
అయితే నెలసరి కొందరికి చాలా సులభంగా గడిచిపోతుంటుంది.కానీ కొందరికి మాత్రం ఎంతో బాధాకరంగా ఉంటుంది.
ఆ సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ల నొప్పి వంటివి తీవ్రంగా మదన పెడుతుంటాయి.
నెలసరి నొప్పులకు ఎన్నో కారణాలు ఉన్నాయి.
వాటి నుంచి బయటపడడం కోసం చాలా మంది పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు.అయితే కొన్ని కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కూడా నెలసరి నొప్పులను దూరం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీస్ ను ట్రై చేస్తే గనుక నెలసరి నొప్పులు మాయం అవ్వాల్సిందే.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమిడీస్ ఏంటో తెలుసుకుందాం పదండి.
వంటల్లో విరివిగా ఉపయోగించే ఇంగువ నెలసరి నొప్పులను దూరం చేయడంలోనూ సహాయపడుతుంది.అందుకోసం ఒక గ్లాస్ పల్చటి మజ్జిగ తీసుకుని అందులో అర స్పూను ఇంగువ కలిపి సేవించాలి.

నెలసరి సమయంలో ప్రతిరోజు ఈ విధంగా ఇంగువను తీసుకుంటే అందులో ఉండే ప్రత్యేకమైన సుగుణాలు నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, పొత్తి కడుపు నొప్పి వంటి వాటిని దూరం చేస్తాయి.అదే సమయంలో అధిక రక్తస్రావానికి కూడా అడ్డుకట్ట వేస్తాయి.
అలాగే సోంపు నెలసరి సమయంలో ఆడవారికి ఒక వరమనే చెప్పొచ్చు.సోంపును ఎలా తీసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హిట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ సోంపు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆపై వాటర్ ఫిల్టర్ చేసుకుని కొద్దిగా తేనెను కలిపి సేవించాలి.
ఈ సోంపు నీటిని రోజుకు రెండు సార్లు తాగితే గనుక నెలసరి నొప్పుల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది.