ఒక భారతీయ భార్య తన వెల్ష్( Welsh ) భర్తపై చేసిన ఫన్నీ ప్రాంక్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. క్రిస్టినా కేరీ ( Christina Carey )అనే ఒక మహిళ తన భర్తని ఆటపట్టించడానికి ఏకంగా రూ.77,143 పెట్టి పిల్లి బొమ్మ కీచైన్ కొన్నానని చెప్పింది.ఆ తర్వాత అతని రియాక్షన్ చూస్తే మీ కడుపు చెక్కలవ్వడం ఖాయం.
సరదా, నవ్వులు, కాస్త డ్రామా అన్నీ కలిపి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
వీడియోలో క్రిస్టినా మంచి లేత రంగు చీర కట్టుకుని, మెడలో నగలు పెట్టుకుని అచ్చమైన భారతీయ మహిళలాగా( Indian women ) ఉంది.
తను తెలుగులో మాట్లాడుతూ, చేతిలో ఉన్న కీచైన్‌ను కెమెరాకు చూపిస్తూ వీడియో స్టార్ట్ చేసింది.పక్కనే ఉన్న ఆమె భర్త ల్యాప్‌టాప్‌లో ఏదో పని చేసుకుంటూ బిజీగా ఉన్నాడు.
మొదట్లో ఏం జరుగుతుందో అతనికి అస్సలు అర్థం కాలేదు.క్రిస్టినా క్యాజువల్‌గా “ఈ కీచైన్‌ను ఆన్‌లైన్‌లో 700 పౌండ్లు పెట్టి కొన్నాను” అని చెప్పింది.దాంతో ఒక్కసారిగా షాక్ తిన్నట్టుగా ఆమె భర్త రియాక్ట్ అయ్యాడు.“వాట్?!” అంటూ వెంటనే లేచి కీచైన్ దగ్గరికి వచ్చాడు.ఆ చిన్న కీచైన్‌ను చేతిలోకి తీసుకుని పరిశీలిస్తూ అతని ముఖంలో ఒక్కో ఎక్స్‌ప్రెషన్ మారుతూ వచ్చింది.మొదట నమ్మలేకపోయినా, తర్వాత మాత్రం బాగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు.
“ఇదేం చెత్త” అంటూ విసుక్కున్నాడు.“దీనికి నువ్వు 700 పౌండ్లు ఇచ్చావా? ఈ డబ్బుతో నేను కారు కొనుక్కోగలను.ఓ మై గాడ్.
నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? బుర్ర పనిచేస్తుందా లేదా?” అంటూ సీరియస్ అయిపోయాడు.అతని రియాక్షన్ మాత్రం అస్సలు ఫేక్ అనిపించలేదు.
నిజంగానే అంత డబ్బు పెట్టి కీచైన్ కొంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా మరి.వీడియోలో క్రిస్టినా మాత్రం నవ్వాపుకుంటూ చాలా కష్టపడింది.తను ఇంకా తెలుగులోనే మాట్లాడుతూ, కీచైన్‌పై ఉన్న డిజైన్లను చూపిస్తూ దాని రేటుని సమర్థించుకునే ప్రయత్నం చేసింది.కానీ ఆమె భర్త మాత్రం అస్సలు కూల్ అవ్వలేదు.
అతను మాత్రం అది నిజంగానే కొన్న కీచైన్ అని నమ్మి సీరియస్‌గానే ఫీలయ్యాడు.
చివరికి క్రిస్టినా ఇది ప్రాంక్ అని చెప్పకుండానే వీడియో ఎండ్ చేసింది.భర్త మాత్రం ఇంకా షాక్‌లోనే ఉన్నాడు.వీడియో చూసిన వాళ్లంతా మాత్రం నవ్వుకున్నారు.ఇటీవల పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.ఈ జంట మధ్య ఉన్న బాండింగ్‌ను, భర్త రియాక్షన్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ఒక యూజర్ “హహహ పాపం” అని కామెంట్ చేస్తే, మరొకరు “అయినా అతను ఎంత ప్రశాంతంగా ఉన్నాడో చూడు, ఎక్కువ మాటలు కూడా అనలేదు” అంటూ కామెంట్ చేశారు.
ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఒక లుక్ వేసేయండి మరి.