నల్ల ద్రాక్షతో నల్ల మచ్చలకు చెక్.. ఎలా వాడాలంటే?

ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పండ్లలో నల్ల ద్రాక్ష ఒకటి( Black grapes ).నల్ల ద్రాక్ష లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

 Try This Grape Face Mask For Spotless Skin! Grape Face Mask, Spotless Skin, Skin-TeluguStop.com

అవి మన ఆరోగ్యానికి వివిధ రకాలుగా తోడ్పడతాయి.అలాగే నల్ల ద్రాక్ష చర్మ ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది.

ముఖ్యంగా చర్మం పై ఏర్పడిన నల్ల మచ్చలను వదిలించడానికి నల్ల ద్రాక్ష సహాయపడుతుంది.మరి నల్ల ద్రాక్షతో నల్ల మచ్చలకు ఎలా చెక్ పెట్టవచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గింజ తొలగించిన పది నల్ల ద్రాక్ష పండ్లను వేసుకోవాలి.అలాగే రెండు టమాటో స్లైసెస్( Tomato slices ) వేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి( Multani soil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై తడి క్లాత్ తో వేసుకున్న ప్యాక్ ను తొలగించాలి.ఫైనల్ గా వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.

Telugu Tips, Black Grapes, Blemishes, Grapes Benefits, Latest, Skin Care, Skin C

ఈ విధంగా రెండు రోజులకు ఒకసారి చేశారంటే చర్మం పై ఏర్పడిన నల్ల మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మరియు షైనీగా మారుతుంది.అలాగే నల్ల ద్రాక్ష లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి.ఇవి మొటిమల నివార‌ణ‌కు సహాయపడతాయి.

Telugu Tips, Black Grapes, Blemishes, Grapes Benefits, Latest, Skin Care, Skin C

ద్రాక్షలో ఉండే పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గా ప‌ని చేసి వివిధ చర్మ వ్యాధులతో పోరాడ‌తాయి.అంతేకాకుండా పైన చెప్పిన విధంగా నల్ల ద్రాక్షతో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల స్కిన్ ఏజింగ్ ఆలస్యం అవుతుంది.చర్మంపై ముడతలు ఏమైనా ఉంటే త‌గ్గుముఖం పడతాయి.మరియు చర్మం అందంగా కాంతివంతంగా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube