వైష్ణవి చైతన్య(vaishnavi chaitanya).ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా బేబీ.
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)హీరోగా నటించిన సినిమాలో హీరోయిన్గా నటించి రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాలో నటించడం కంటే ముందు సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయి బోలెడంత పాపులర్ సంపాదించుకుంది.
ఈ సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది.ఇకపోతే బేబీ సినిమా(Baby movie) ఈ ముద్దుగుమ్మకు ఎంతగా గుర్తింపు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమా తర్వాత ఆమె సొంత పేరు కంటే బేబీ బ్యూటీ అని పిలవడం మొదలుపెట్టారు అభిమానులు.ఇక ఇటీవల లవ్ మీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ప్రస్తుతం తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టింది.వైష్ణవి చైతన్య చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా నటించిన జాక్ మూవీతో మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకులను పలకరించింది వైష్ణవి చైతన్య.
ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం(Bommarillu Bhaskar) వహించారు.రొమాంటిక్ యాక్షన్ జానర్ లో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా మూవీ మేకర్స్ ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఇందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.నా ఫస్ట్ క్రష్ రామ్ పోతినేని(Ram Pothineni).హీరోయిన్ల విషయానికొస్తే అనుష్క, సాయి పల్లవి నా ఫేవరెట్ హీరోయిన్స్ అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది.నా ఫస్ట్ రెమ్యూనరేషన్ 3 వేలు.18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డాను కానీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిపోయింది.మెగాస్టార్ చిరంజీవి గారు సహజనటి జయసుధతో నన్ను పోల్చడం నాకు చాలా ఆనందంగా అనిపించింది.నా జీవితంలో మరిచిపోలేని ప్రశంస.బేబీ మూవీ తర్వాత ఆమెకు క్రేజ్ పెరగడమే కాదు.అభిమానుల నుంచి ప్రపోజల్స్ బీభత్సంగా వచ్చాయి అని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య.







