మధ్యప్రదేశ్‌లో( Madhya Pradesh ) జరిగిన ఒక హృదయ విదారక సంఘటన వీడియో సోషల్ మీడియాలో ( social media )వైరల్ అవుతోంది.ఒక వ్యక్తి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న చిరుతపులుల గుంపుకు నీళ్లు ఇస్తున్న దృశ్యం అది.
చాలా మంది ఈ వీడియో చూసి కదిలిపోయారు.ఆ వ్యక్తి చేసిన మంచి పనిని మెచ్చుకున్నారు.
కానీ అటవీ శాఖ మాత్రం దీన్ని వేరేలా చూసింది.వీడియోలో కనిపించిన వ్యక్తిని ఇప్పుడు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

ఈ ఘటన కునో నేషనల్ పార్క్ ( Kuno National Park )దగ్గర జరిగింది.వీడియోలో నీళ్లు ఇస్తున్న వ్యక్తి పేరు సత్యనారాయణ్ గుర్జర్( Satyanarayan Gurjar ).అతను అటవీ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.వీడియోలో గుర్జర్ ఒక జెర్రీ క్యాన్‌లో నీళ్లు తీసుకొని నెమ్మదిగా చిరుతపులుల వైపు నడుచుకుంటూ వెళ్ళడం చూడొచ్చు.సురక్షితమైన దూరంలో ఆగి, స్టీల్ ప్లేట్‌లో నీళ్లు పోశాడు.వీడియో తీస్తున్న వాళ్lu “రండి రండి” అని పిలుస్తుంటే వినొచ్చు.
ఆశ్చర్యంగా చిరుతపులులు చాలా ప్రశాంతంగా స్పందించాయి.అవి లేచి నిలబడి ప్లేట్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి నీళ్లు తాగడం వీడియోలో ఉంది.

ఇది జరిగి సరిగ్గా రెండు వారాల ముందే ఇదే ప్రాంతంలో ఇంకో ఘటన జరిగింది.అప్పుడు కొంతమంది గ్రామస్తులు జ్వాల అనే చిరుతపులిని, దాని నాలుగు పిల్లల్ని రాళ్లతో కొట్టారు.ఆ దుశ్చర్య చాలా మందిని షాక్‌కి గురిచేసింది.అలాంటి సమయంలో ఈ వీడియో ఒక మార్పుకి సంకేతంలా అనిపించింది.మనిషికి, అడవి జంతువులకు మధ్య శాంతి నెలకొన్నట్టు కనిపించింది.కానీ అటవీ శాఖ మాత్రం దీనికి విరుద్ధంగా స్పందించింది.
మనుషులతో ఇంత దగ్గరగా ఉండటం భవిష్యత్తులో ప్రమాదకరమని వాళ్లు ఆందోళన చెందారు.చిరుతపులులు మనుషులకు బాగా అలవాటు పడిపోతాయని అధికారులు భయపడ్డారు.
అలా జరిగితే అవి ఊళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని, అది మనుషులకి, జంతువులకి కూడా ప్రమాదకరంగా మారవచ్చు అని వాళ్లు అంటున్నారు.వీడియో వైరల్ అయ్యాక కునో ఫారెస్ట్ డివిజన్ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
ఆ తర్వాత గుర్జర్‌ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.ఒక ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ, “ప్రజలు ఈ జంతువుల్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారని ఇది చూపిస్తుంది.
కానీ ఇలాంటి చనువుని మాత్రం మేం అనుమతించలేం.అడవి జంతువులు అడవిలోనే ఉండాలి” అని అన్నారు.







