వేసవిలో పిల్ల‌ల ఆరోగ్యం ప‌ట్ల తీసుకోవాల్సిన జాగ్ర‌త్తలు ఇవే!

వేస‌వి కాలం రానే వ‌చ్చింది.పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

 Precautions For The Health Of Children During The Summer! Precautions, Health, S-TeluguStop.com

ఈ సీజ‌న్‌లో పిల్ల‌ల ఆరోగ్యం కోసం త‌ల్లిదండ్రులు ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ జాగ్ర‌త్త‌లు ఏంటీ.

వాటిని ఎందుకు తీసుకోవాలి వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.

వేస‌వి కాలంలో చాలా మంది పిల్ల‌లు ఆట‌ల్లో ప‌డిపోయి వాట‌ర్‌ను తీసుకోవ‌డం మ‌ర‌చిపోతుంటారు.

ఫ‌లితంగా డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంటారు.అందుకే త‌ల్లిదండ్రులు ఎప్ప‌టిక‌ప్పుడు పిల్ల‌ల చేత వాట‌ర్‌ను తాగించాలి.

కొబ్బ‌రి నీళ్లు, పండ్ల రసాలు, మ‌జ్జిగ‌, రాగి జావ‌, సబ్జా వాట‌ర్ వంటి వాటినీ పిల్ల‌ల‌కు ఇవ్వాలి.త‌ద్వారా పిల్ల‌ల శ‌రీరంలో నీటి స్థాయిలు ప‌డిపోకుండా ఉంటాయి.

అలాగే వేస‌విలో పిల్ల‌ల‌కు మంద‌పాటి బ‌ట్ట‌లను పొర‌పాటున కూడా వేయ‌రాదు.మందంగా ఉండే దుస్తులు శరీరాన్ని మ‌రింత‌ వేడెక్కించేస్తాయి.

అందుకే వదులైన దుస్తుల‌నే పిల్ల‌ల‌కు వేయాలి.స‌మ్మ‌ర్‌లో చాలా మంది పిల్ల‌లు డ‌యేరియా బారిన ప‌డుతుంటారు.

ఈ స‌మ‌స్య నుంచి పిల్ల‌ల‌ను ర‌క్షించుకోవాలంటే.ఇంట్లో వండిన తాజా ఆహారాల‌నే పిల్ల‌ల‌కు పెట్టాలి.

మండే ఎండ‌ల్లో వారిని ఆట‌ల‌కు పంప‌రాదు.ఉదయం, లేదా సాయంత్రం ఎండ తీవ్రత తక్కువగా ఉండే సమయంలోనే పిల్లలను ఆరుబయట ఆడనివ్వాలి.

Telugu Foods, Tips-Telugu Health Tips

స‌మ్మ‌ర్‌లో కూల్ డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్స్‌, నూనెలో వేయించిన‌ ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్, కూలింగ్ వాట‌ర్, స్వీట్స్‌ వంటి వంటికి పిల్ల‌ల‌ను దూరంగా ఉంచాలి.వాటి బ‌దులు తాజా ఆకుకూర‌లు, పెరుగు, తాజా పండ్లు, చక్కెర జోడించ‌ని స్మూతీలు, సీఫుడ్‌, స‌లాడ్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి.ఇక వేసవి వేడి ప్రభావం పిల్లల మీద పడకుండా ఉండేందుకు ఏసీల్లోనే గంట‌లు గంట‌లు వారిని ఉంచ‌డం కూడా క‌రెక్ట్ కాదు.అలా చేయ‌డం వ‌ల్ల మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.

అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి బయటకు వచ్చి పదినిమిషాల పాటైనా గడ‌పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube