నవగ్రహాలకు గర్భాలయాలు ఎందుకు ఉండవో తెలుసా?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు ముక్కోటి దేవతలు ఉన్నాయి.అయితే మన దేశం అంతటా ఒక్కో దేవుడిని ఒక్కోలా కొలుస్తుంటారు.

 Do You Know Why Navagrahas Have Sanctuaries , Devotional , Garbhalayam , Nava-TeluguStop.com

అందుకోసం ప్రత్యేక ఆలయాలు నిర్మిస్తారు.ముఖ్యంగా విగ్రహ ఉత్సవ మూర్తిని గర్భాలయంలోనే ఉంటాయి.

అంతే కాకుండా శివాలయం, ఆంజనేయ స్వామి గుడుల్లో ఎక్కువగా మనకు నవ గ్రహాలు కన్పిస్తుంటాయి.కానీ నవగ్రహాలు ఆలయం ఆవరణలోనే ఓ పక్కన నిర్మించబడి ఉంటాయి.

అయితే వీటికి ఒఖ గుడి ఉన్నప్పటికీ… గర్భాలయం మాత్రం ఉండదు.ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నవ గ్రహాలకు విడివిడిగా ఆలయాలు కట్టేటట్లయితే గర్భగుడి కట్టవచ్చు.తమిళనాడులోని సూర్యనార్ కోయర్ దగ్గర నవ గ్రహాలకు విడిగా గర్భాలయాలతో ఆలయాలు ఉన్నాయి.నవ గ్రహాలు ఒక పీఠం మీద నిర్మాణం చేసినప్పుడు ఈ విగ్రహాలు అష్టదిక్కులకు అభిముఖంగా ఉంటాయి.అలా ఉన్నప్పుడు గర్భాలయం నిర్మాణం చేయరాదు.

కారణం గర్భాలయంలో ఉన్న ఏ విగ్రహాన్ని అయినా సరే భక్తులు ఎదురుగా ఉండి చూసేందుకు వీలుగా విగ్రహాలు ఏర్పాటు అవుతాయి.మరి నవ గ్రహాల్లో సూర్యశక్తులు మాత్రమే భక్తుడికి అభిముఖంగా ఉండి మిగిలినవి వేర్వేరు దిక్కుల్లో ఉంటాయి.

కావున వాటిని దర్శించుటకు భక్తుడు విగ్రహం దగ్గరకు వెళ్లాలి లేనిది ఆ పీఠం మీద మిగిలిన విగ్రహాలు దర్శనీయం కావు.అందువలన భక్తులందరూ లోపలకు వెళ్లాలంటే గర్భాలయం మీదుగా నిర్మాణం చేస్తే.

ఆగమ ధర్మాలకు విరోధం అవుతుంది.కావున ఒక పీఠం మీద తొమ్మిది విగ్రహాలు (నవ గ్రహాలు) ఉంచినప్పుడు గర్భాలయాలు పనికి రావు.

అందుకే నవ గ్రహాలకు గర్భాలయం నిర్మించరు.

DO YOU KNOW WHY NAVAGRAHAS HAVE SANCTUARIES

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube