సాధారణంగా నవగ్రహాలు మనకు ఎక్కువగా శివాలయం లో కనిపిస్తాయి.అయితే ఆలయ ఆవరణంలో కేవలం ఒక మండపంలో మాత్రమే ఈ నవగ్రహలు మనకు దర్శనమిస్తాయి.
అయితే ఈ మండపంలో కేవలం మనకు 9 గ్రహాలు దర్శనమివ్వడం చూస్తుంటాము.కానీ శివాలయంలో మాత్రం దేశంలో ఎక్కడా లేనివిధంగా నవ గ్రహాల కూటమి ఏర్పడి సంపూర్ణ నవగ్రహ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.
మరి ఈ సంపూర్ణ నవగ్రహ దేవాలయం ఎక్కడ ఉంది? ఆలయంలోని నవగ్రహాల విశిష్టత ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలోని, మెదక్ జిల్లా, తొగుట మండలం, రాంపూర్ గ్రామంలోని శ్రీ గురు మదనానంద శారదాపీఠం ఉంది.
ఆ పీఠంలో సంపూర్ణ నవగ్రహ ఆలయం ఉంది.అన్ని ఆలయాలలో మాదిరిగా కాకుండా ఈ ఆలయంలో నవగ్రహాలు ఎంతో ప్రత్యేకమైనవి.ఈ నవగ్రహాలలో ప్రతి గ్రహానికి ఆదిదేవుడు, ప్రత్యర్థిదేవతలు, దిక్పాలకుల సహితంగా ఈ ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలో ప్రవేశించగానే మనకు మొత్తం 64 మంది దేవతామూర్తులు దర్శనమిస్తారు.
ఈ విధంగా ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించిన దేవతలు ఈ ఆలయంలో కొలువై ఉండటం వల్ల సంపూర్ణ నవగ్రహ దేవాలయం అని పిలుస్తారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉన్నటువంటి స్పటిక లింగం దర్శనమిస్తుంది.కోటి సైకత లింగాల్ని చేసి వాటిపై ఈ శివలింగాన్ని ప్రతిష్టించారు.ఈ ఆలయంలో కొలువై ఉన్న స్పటిక లింగాన్ని బావని చంద్రమౌళీశ్వరుడిగా కొలుస్తారు.
ఈ ఆలయానికి ఎక్కువగా గ్రహస్థితిలో దోషాలున్నవారు, కాలసర్ప దోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు ఎక్కువగా ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సంపూర్ణ నవగ్రహ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాలలో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి సందర్శించి స్వామి వారికి మొక్కులు తీర్చుకుంటారు.