టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి సెలబ్రిటీల మెడకు మాదాపూర్ డ్రగ్స్( Maadapur Drugs ) విషయం ఒక ఉచ్చు లాగా బిగుసుకుంది.మాదాపూర్ డ్రగ్స్ కేసులో భాగంగా A29 గా ఉన్నటువంటి నటుడు నవదీప్( Navadeep ) ను నేడు నార్కోటిక్ పోలీసులు విచారించారు ఈయనని విచారించడానికి గాను కోర్టు నుంచి అనుమతి తీసుకున్నటువంటి నార్కోటిక్ పోలీసులు దాదాపు 8 గంటల పాటు నవదీప్ ను విచారించారు.
ఈ 8 గంటల సమయం పాటు ఆయనకు మూడుసార్లు బ్రేక్ ఇచ్చి విచారణ చేపట్టారని విచారణ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి నవదీప్ వెల్లడించారు.నార్కోటిక్ అధికారులు తనని చాలా లోతుగా మూలాల నుంచి కూడా విచారణ చేశారని ఈయన వెల్లడించారు.
దాదాపు 8 సంవత్సరాల క్రితం నాటి ఫోన్ కాల్స్ ఆధారంగా తనని విచారణ చేశారని అధికారులు మాత్రం చాలా బ్యూటిఫుల్ గా విచారణ చేస్తున్నారు అంటూ ఈ సందర్భంగా నవదీప్ వెల్లడించారు.అయితే తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే విషయాలను తనకు తెలియజేయలేదని ఈయన పేర్కొన్నారు.ఇక మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి రామ్ చందర్ అనే వ్యక్తిపై కూడా ఈ సందర్భంగా నవదీప్ స్పందించారు.నాకు ఈ హైదరాబాదులో సుమారు పదివేల మంది వరకు తెలుసు ఆ పదివేల మందిలో ఈ రామ్ చందర్ అనే వ్యక్తి కూడా ఒకరు అంటూ ఈయన సమాధానం చెప్పారు.
తదుపరి విచారణ ఎప్పుడున్నా కానీ తాను మాత్రం పోలీసులకు అందుబాటులోనే ఉంటానని ఈ సందర్భంగా నవదీప్ మీడియా సమావేశంలో మాట్లాడారు.అయితే తాజా సమాచారం ప్రకారం నార్కోటిక్ అధికారులు ఈయన ఫోన్( Phone ) సీజ్ చేశారని తెలుస్తోంది.గతంలో ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టినటువంటి అధికారులు ఈసారి చాటింగ్ డేటా, మెసేజింగ్ డేటా గురించి పూర్తి విచారణ జరుపబోతున్నారని అందుకే ఈయన ఫోన్ కూడా సీజ్ చేసి ఆయనకు షాక్ ఇచ్చారని తెలుస్తోంది.అయితే ఈ డేటా మొత్తం సేకరించిన తర్వాత మరోసారి నవదీప్ ను నార్కోటిక్ అధికారులు విచారణకు పిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తెలుస్తుంది.