టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీమణులలో పూనమ్ కౌర్( Poonam Kaur ) ఒకరు కాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్లు సంచలనం అవుతున్నాయి.త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) టార్గెట్ గా ఇప్పటికే పలు సందర్భాల్లో కామెంట్లు చేసిన ఆమె తాజాగా మరోసారి కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో( Movie Artists Association ) తాను ఫిర్యాదు చేసి చాలా కాలమైందని పూనమ్ కౌర్ అన్నారు.
ఇప్పటివరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ ఫిర్యాదు గురించి స్పందించలేదని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.
నా లైఫ్ ను నాశనం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన త్రివిక్రమ్ ను సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ పెద్ద మనిషిగానే ప్రోత్సహిస్తోందని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.అయితే పూనమ్ కౌర్ కామెంట్ల గురించి ఇండస్ట్రీ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.
![Telugu Allu Arjun, Poonam Kaur, Poonamkaur, Tollywood-Movie Telugu Allu Arjun, Poonam Kaur, Poonamkaur, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2025/01/poonam-kaur-sensational-comments-about-trivikram-srinivas-detailsd.jpg)
వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పూనమ్ కౌర్ మినహా ఎవరూ ఇలాంటి ఆరోపణలు చేయలేదు.పూనమ్ కౌర్ ట్వీట్ కు ఇండస్ట్రీ నుంచి రియాక్షన్ వచ్చే అవకాశాలు కూడా లేవని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పూనమ్ కౌర్ రాబోయే రోజుల్లో అయినా న్యాయం జరుగుతుందేమో చూడాల్సి ఉంది.పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
![Telugu Allu Arjun, Poonam Kaur, Poonamkaur, Tollywood-Movie Telugu Allu Arjun, Poonam Kaur, Poonamkaur, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2025/01/poonam-kaur-sensational-comments-about-trivikram-srinivas-detailss.jpg)
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం బన్నీ సినిమాకు( Bunny Movie ) స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాతో గతేడాది హిట్ అందుకున్నారు.త్రివిక్రమ్ బన్నీ కాంబో మూవీ ఈ ఏడాది సెకండాఫ్ లో మొదలు కానుందని తెలుస్తోంది.బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి ఉంది.
త్రివిక్రమ్ ఇకపై పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.