ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.48
సూర్యాస్తమయం: సాయంత్రం.5.55
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.8.44 ల11.33
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:
ఈరోజు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి.బంధు మిత్రులతో సఖ్యత గా వ్యవహరిస్తారు.వృత్తి వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి.ముఖ్యమైన విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.ఉద్యోగ విషయంలో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి.
వృషభం:
ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది.వ్యాపారాల్లో శ్రమ మరింత పెరుగుతుంది.దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి.ఉద్యోగమున అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది.
మిథునం:
ఈరోజు నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.బంధు మిత్రులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు.
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది.
కర్కాటకం:
ఈరోజు దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.చేపట్టిన పనులలో మరింత ఒత్తిడి పెరుగుతుంది.బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.వృత్తి వ్యాపారములలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
సింహం:
ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి.సోదరుల నుండి ధన సహాయం లబిస్తుంది.చేపట్టిన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.
దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు.వ్యాపారాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
కన్య:
ఈరోజు సమాజంలో పెద్దవారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.రుణగ్రస్తుల నుండి రావలసిన ధనం సకాలంలో అందుతుంది.ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారములలో సమస్యలు అధిగమిస్తారు.ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.
తుల:
ఈరోజు వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ఉద్యోగ విషయమై అధికారుల ఆగ్రహానికి గురవుతారు.సోదరులతో స్ధిరాస్తి సంబంధిత వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
వృశ్చికం:
ఈరోజు చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో గానీ పూర్తి కావు.బంధు మిత్రులు మీ మాటలతో విభేదిస్తారు.ఇంటా బయట పరిస్థితులు చికాకు కలిగిస్తాయి.
వృత్తి వ్యాపారమున ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది.నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
ధనుస్సు:
ఈరోజు జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు.వ్యాపారాలలో అంచనాలు నిజమౌతాయి.గృహప్రవేశం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో మనస్పర్ధలు తొలగుతాయి.
మకరం:
ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాదిస్తారు.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.పాత విషయాలు జ్ఞప్తికి వస్తాయి.
అవసరానికి ఇతరుల నుండి సహాయం అందుతుంది.వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.సంతాన, విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.
కుంభం:
ఈరోజు బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి.చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి.
మీనం:
ఈరోజు ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబ వ్యవహారాలలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి.వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.