ఒరిజినల్ రివాల్వర్ తో షూటింగ్ స్పాట్ కు చిరంజీవి ఎందుకు వచ్చినట్లు?

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం టాప్ హీరోగా ఉన్న నటుడు చిరంజీవి.ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి.

 Chiranjeevi Came To Shooting With Original Rewalvar , Chiranjeevi, Original Rewa-TeluguStop.com

అద్భుతమైన క్యారెక్టర్లు పోషించి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాదు.

ప్రతి సినిమాకు కొత్త రకం గెటప్ తో అందరినీ ఆకట్టుకున్నాడు కూడా.మాస్, క్లాస్, యాక్షన్ అని తేడా లేదు.

అన్ని పాత్రలనూ అవలీలగా పోషించాడు.అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

అందుకే ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోల హవా కొనసాగుతున్న సమయంలోనూ యంగ్ హీరోగా తన సత్తా చాటుకున్నాడు.ఎవరి ససోర్టు లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి.

స్వశక్తితో ఉన్నత స్థాయికి చేరాడు చిరంజీవి.అయితే ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తన వెంట రివాల్వర్ తీసుకెళ్లి అందరినీ షాక్ కు గురించి చేశాడు.

ఇంతకీ తను ఎందుకు రివాల్వర్ తీసుకెళ్లాడు? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిజానికి చిరంజీవి ఏపని చేసినా దానికి ఓ కారణం ఉంటుంది.

అప్పట్లో చిరంజీవి హీరోగా జంధ్యాల దర్శకత్వంలో చంటబ్బాయి అనే సినిమా తెరకెక్కింది, ఈ సినిమా తన కెరీర్ లో ఏంతో ప్రత్యేక సంపాదించుకుంది.ఈ సినిమా తర్వాత చంటబ్బాయ్ అనే సినిమా చేశాడు.

ఇందులో ఆంగ్లో ఇండియన్ లేడీ అనే ఓ గెటప్ వేస్తాడు చిరంజీవి.అంతేకాదు.

హరిదాసు వేశంలో డిటెక్టివ్ క్యారెక్టర్ చేశాడు.ఈ పాత్ర పోషించే నటులు వేరే సినిమాల్లో అయితే డూప్లికేట్ రివాల్వర్ ఉపయోగిస్తారు.

కానీ చిరంజీవి మాత్రం ఒరిజినల్ రివాల్వర్ వాడాడు.

Telugu Chantabbay, Chiranjeevi, Jandhyala-Telugu Stop Exclusive Top Stories

అసలు ఆయన ఒరిజినల్ రివాల్వర్ ఎక్కడి నుంచి తను తెచ్చాడు అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం.చిరంజీవి అగ్ర నటుడిగా అప్పుడప్పుడే ఎదిగి వస్తున్నాడు.ఈ సమయంలో ఆయన తన సెక్యూరిటీ కారణంగా ఓ లైసెన్స్ రివాల్వర్ కు అప్లై చేసుకున్నాడు.

ప్రభుత్వం ఆయనకు మంజూరు చేసింది.అలా ఒరిజినల్ రివాల్వర్ తెచ్చుకునే వాడు చిరంజీవి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube