నైట్ మిగిలిపోయిన రైస్ ను కొందరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే హీట్ చేసుకుని తింటూ ఉంటారు.కానీ కొందరు మాత్రం డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై అస్సలు అలా చేయకండి.ఎందుకంటే నైట్ మిగిలిపోయిన రైస్ తో జుట్టును ఒత్తుగా మరియు పొడుగ్గా మార్చుకోవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు నైట్ మిగిలిపోయిన రైస్ ను వేసుకోవాలి.అలాగే రెండు మందారం ఆకులు, ఒక మందార పువ్వు( Hibiscus Flower )ను తీసుకుని తుంచి మిక్సీ జార్ లో వేయాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి, ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్( Aloe Vera Gel ), రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు మిగిలిపోయిన రైస్ తో ఇలా హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు రాలడం( Hair fall ) క్రమంగా తగ్గుతుంది.కుదుళ్లు సూపర్ స్ట్రోంగ్ గా మారతాయి.
హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

దాంతో కొద్ది రోజుల్లోనే ఒత్తైన పొడవాటి జుట్టు మీ సొంతం అవుతుంది.అలాగే వారానికి రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.
మరియు చిట్లిన జుట్టు సైతం రిపేర్ అవుతుంది.కాబట్టి ఇకపై మిగిలిపోయిన రైస్ ను డస్ట్ బిన్ లోకి తోయకుండా జుట్టు సంరక్షణకు వాడేందుకు ప్రయత్నించండి.







